కొంతమందికి కొన్నింటిపై ఎనలేని ప్రేమ ఉంటుంది. కొంతమందికి మొక్కలు పెంచడం ఇష్టమైతే.. మరికొంతమందికి పక్షులు పెంచడం ఇష్టంగా ఉంటుంది. అలా పక్షులపై ప్రేమను పెంచుకున్న ఓ వ్యక్తి వాటికోసం ఏకంగా రూ. 20 లక్షలు ఖర్చుచేశాడు. వివరాలలోకి వెళ్తే.. గుజరాత్‌కు చెందిన 75 ఏండ్ల భగవాన్జీ రూపపారాకు పక్షులంటే మక్కువ. దాంతో ఆయన పక్షులకు హానీ కలగకుండా ఏదైనా చేయాలనుకున్నాడు. అందుకోసం నది ఒడ్డున ఓ బర్డ్హౌస్ని ఏర్పాటుచేశాడు. ఈ బర్డ్హౌస్ని 140 అడుగుల పొడవు, 70 అడుగుల వెడల్పు, మరియు 40 అడుగుల ఎత్తుతో నిర్మించాడు. ఈ హౌస్ కోసం తన సొంత భూమి, డబ్బులను ఖర్చుపెట్టి.. 2,500 కంటే ఎక్కువ మట్టి కుండలను ఉపయోగించారు.
పక్షులకు సురక్షితమైన ఆశ్రయాన్ని అందించడంతో పాటు హానికరమైన వాతావరణ పరిస్థితుల నుండి కూడా రక్షించడానికి ఇది ఉపయోగపడుతుందని భగవాన్ అంటున్నారు. అక్కడకు వచ్చే సందర్శకులు పక్షులకు హానికలిగించకుండా భగవాన్జీ కంట్రోల్ చేస్తాడు. ప్రకృతి ప్రేమికులు అన్ని జీవులను సమానంగా చూడాలని చెబుతుంటాడు. భగవాన్జీ కేవలం బర్డ్హౌస్ని ఏర్పాటుచేయడమే కాకుండా.. పక్షులకు ఆహారం మరియు నీటిని కూడా అందిస్తాడు. భగవాన్ జీ చేసిన ఈ పనివల్ల వేలాది పక్షులు ఇక్కడకు వస్తూ.. వచ్చిపోయేవారికి కనువిందుచేస్తాయి. కనిపిస్తాయి.
For More News..