- ఇయ్యాల నియామక పత్రాలు తీసుకోనున్న అభ్యర్థులు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర విద్యాశాఖలో మరో 752 మంది ఉద్యోగులు చేరబోతున్నారు. గ్రూప్–4 ద్వారా జూనియర్ అసిస్టెంట్లు, అకౌంటెంట్లుగా కొలువులు పొందిన వారికి పెద్దపల్లిలో బుధవారం సీఎం రేవంత్ రెడ్డి నియామక పత్రాలు అందించనున్నారు. స్టేట్ వైడ్గా 11 సర్కారు వర్సిటీల్లో 572 మంది, కళాశాల విద్యాశాఖ పరిధిలోని డిగ్రీ కాలేజీల్లో 36 మంది, టెక్నికల్ ఎడ్యుకేషన్ పరిధిలోని పాలిటెక్నిక్ కాలేజీల్లో 46 మంది, ఇంటర్ ఎడ్యుకేషన్ పరిధిలోని సర్కారు జూనియర్ కాలేజీల్లో 64 మంది, స్కూల్ఎడ్యుకేషన్ పరిధిలో స్కూళ్లు, ఇతర ఆఫీసుల్లో 34 మంది కొత్తగా ఉద్యోగాల్లో చేరనున్నారు.
కొత్తగా వస్తున్న ఉద్యోగులతో వివిధ సంస్థలు, కాలేజీల్లో సిబ్బంది కొరత కొంత మేరకు తీరనున్నది. అయితే, ఉద్యోగాలు పొందిన వారిలో ఎక్కువ మంది ఇంజినీరింగ్ బ్యాక్ గ్రౌండ్ నుంచి వచ్చిన వారే ఉన్నారని అధికారులు చెప్తున్నారు.