
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ కేసులు మళ్లీ పెరిగాయి. సోమవారంతో పోల్చుకుంటే ఒకే రోజుకే వెయ్యికి పైగా కేసులు నమోదయ్యాయి. తాజాగా గడచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 7,553 కరోనా కేసులు నమోదయ్యాయి. తాజా కేసులతో కలిపి రాష్ట్రంలో కరోనా కరోనా కేసుల సంఖ్య 6,39,302 కు చేరుకుంది. ఇందులో 71,465 యాక్టివ్ కేసులో ఉండగా 5,62,376 మంది కరోనా నుంచి కోలుకున్నారు.
తాజాగా మరో 51మంది కరోనాతో పోరాడి మృతి చెందారు. దీనితో మృతి చెందిన వారి సంఖ్య 5,461కి చేరుకుంది. ఇక గడచిన 24 గంటల్లో 68,829 టెస్టుల చేయగా, మొత్తం టెస్టుల సంఖ్య 52,29,529 కి చేరుకుంది. 10,555 మంది కరోనా నుండి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ఈ మేరకు ఏపీ వైద్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.
గడిచిన 24 గంటల్లో తూర్పు గోదావరి జిల్లాలో 1166 కేసులు, పశ్చిమ గోదావరి 989, చిత్తూరు 902, గుంటూరు 606, ప్రకాశం 672, గుంటూరు 606, కడప 589, నెల్లూరు 556, విశాఖ 410, విజయనగరం 391, శ్రీకాకుళం 347, కృష్ణా 344, కర్నూలు 272 నమోదయ్యాయి.