Delhi Air Polution: పొల్యూషన్ ఎఫెక్ట్..ఢిల్లీలో ప్రతి కుటుంబంలో ఒకరికి అనారోగ్యం..షాకింగ్ సర్వే రిపోర్టు

Delhi Air Polution: పొల్యూషన్ ఎఫెక్ట్..ఢిల్లీలో ప్రతి కుటుంబంలో ఒకరికి అనారోగ్యం..షాకింగ్ సర్వే రిపోర్టు

సర్వేల్లో సంచలన విషయాలు..ఢిల్లీలో కాలుష్యం ప్రమాదకరస్థాయిలో నమోదు అవుతోంది. ఎంతలా అంటే.. గాలి కాలుష్యంతో ఢిల్లీలో నివసించే ప్రతి కుటుంబంలో ఒకరు అనారోగ్యం బారిన పడుతున్నారు. ఎయిర్ క్వాలిటి  ఇండెక్స్ లో నమోదు చేసే వాయు కాలుష్యం కంటే ఎక్కువగా నమోదు అవుతోంది. ప్రభుత్వం ఎన్ని చర్యలు చేపట్టినా గాలి కాలుష్యం నియంత్రణ జరగడంలేదు.. ఇటీవల సుప్రీంకోర్టు కూడా దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం సీరియస్ అయింది.. కాలుష్య నివారణకు పటిష్టమైన చర్యలు చేపట్టాలని ఆదేశించింది. 

ఢిల్లీలో వాయు కాలుష్యంతో రోగాల బారిన పడుతున్న వారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతుందని ఇటీవల నిర్వహించిన సర్వేలు నిర్దారించింది. ఢిల్లీలో నివసించే 75 శాతం కుటుంబాల్లో వాయు కాలుష్యంతో ఒకరు అనారోగ్యంతో చికిత్స పొందుతున్నారని తేల్చింది. తలనొప్పి, గొంతు నొప్పి, దగ్గు, శ్వాస కోస వ్యాధుల్లో ఆస్పత్తుల్లోచేరుతున్నారు.   

లోక్ సర్కిల్ అనే ఆన్ లైన్ కమ్యూనిటీ ప్లాట్ ఫాం నిర్వహించిన ఓ సర్వేలో ఢిల్లీలో వాయు కాలుష్యంతో 58 శాతం మంది తల నొప్పితో బాధపడుతున్నట్లు తేలింది.50 శాతం కుటుం బసభ్యులు శ్వాస కోస వ్యాధులతో చికిత్స పొందుతున్నట్లు తెలిసింది. 

గురుగ్రామ్, ఢిల్లీ, నోయిడా, ఫరీదాబాడ్, ఘజియాబాద్లో దాదాపు 21 వేల మంది నివాసితులను సర్వే చేయగా.. వారితో 63 శాతం మంది పురుషులు, 37 శాతం మంది మహిళలు రోగాల బారిన పడినట్లు గుర్తించారు.