కోటి దీపోత్సవానికి హైదరాబాద్లో 76 స్పెషల్​ బస్సులు

హైదరాబాద్​సిటీ, వెలుగు : కార్తీక మాసం సందర్భంగా ఎన్టీఆర్​స్టేడియంలో నిర్వహించనున్న కోటి దీపోత్సవానికి ఆర్టీసీ స్పెషల్​బస్సులను ఏర్పాటు చేసింది. ఈ నెల 9 నుంచి 25వ తేదీ వరకు సిటీలోని వివిధ ప్రాంతాల నుంచి స్పెషల్​బస్సులు అందుబాటులో ఉంటా యని చెప్పింది. ఉప్పల్, కంటోన్మెంట్, హయత్​నగర్​, దిల్​సుఖ్​నగర్, హకీంపేట

కూకట్​పల్లి, మెహిదీపట్నం, కుషాయిగూడ, జీడిమెట్ల, మేడ్చల్, మిధాని, ఇబ్రహీంపట్నం, సెంట్రల్​యూనివర్సిటీ, రాజేంద్రనగర్​, కాచిగూడ, బోడుప్పల్​డిపోల నుంచి ప్రతిరోజు సాయంత్రం 4 నుంచి రాత్రి 11.30 గంటల వరకు 76 బస్సులు నడుస్తాయని స్పష్టం చేసింది.