
హైదరాబాద్ సిటీ, వెలుగు : పాత ఇండ్లను కూల్చి కొత్తగా నిర్మించేవారు వ్యర్థాలను సీ అండ్ డీ ప్లాంట్లకు తరలించాలని జీహెచ్ఎంసీ చెబుతున్నప్పటికీ ఆ ఖర్చును తగ్గించుకునేందుకు రాత్రిళ్లు లారీలు, టిప్పర్లలో తెచ్చి రోడ్ల వెంట డంప్‌చేస్తున్నారు. వాటితో వాహనదారులకు ఇబ్బందులు తలెత్తుతున్నాయి. బల్దియా కమిషనర్ ఇలంబరితి ఆదేశాలతో టౌన్ ప్లానింగ్ అధికారులు వ్యర్థాలను రోడ్లపై డంప్చేస్తున్నవారికి ఫైన్లు వేస్తున్నారు. గడిచిన రెండు నెలల్లో 762 మందికి రూ.42లక్షల20వేల793 ఫైన్లు విధించారు.
కాప్రా సర్కిల్ లో అత్యధికంగా 102 మందికి జరిమాన విధించారు. మూసాపేట, కూకట్‌పల్లి, కుత్బుల్లాపూర్, గాజులరామారం, యూసుఫ్‌గూడ, శేరిలింగంపల్లి, చందానగర్, ఆర్‌సీపురం, పఠాన్ చెరు సర్కిళ్ల పరిధిలో జీడిమెట్ల రీసైక్లింగ్ ప్లాంట్ కి తరలించేందుకు టోల్ ఫ్రీ నెంబర్1800-120-1159 తో పాటు, కె.భూపాల్ రెడ్డి 9705433369 నెంబర్లకి కాల్ చేయవచ్చని అధికారులు సూచిస్తున్నారు.
కాప్రా, ముషీరాబాద్, ఖైరతాబాద్, అల్వాల్, -మల్కాజిగిరి, -సికింద్రాబాద్, బేగంపేట సర్కిళ్ల పరిధిలో తూంకుంట ప్లాంట్ కి తరలించాలంటే టోల్ ఫ్రీ నెంబర్ 18002030033; 73300 00203కు, తిలక్: 88857 37472 నంబర్లకు కాల్చేయాలని చెబుతున్నారు.