రాష్ట్రంలో 766 కిలోమీటర్ల కొత్త రోడ్లు

రూ.13,157 కోట్లు.. 766 కిలోమీటర్లు

21న రాష్ట్రంలో రోడ్ల ప్రాజెక్టులు ప్రారంభించనున్న కేంద్ర మంత్రి గడ్కరీ

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో కొత్తగా నిర్మించిన పలు రోడ్ల ప్రాజెక్టులను కేంద్ర రవాణా మంత్రి నితిన్ గడ్కరీ 21న జాతికి అంకితం చేయనున్నారు. అలాగే మరికొన్ని ప్రాజెక్టులకు భూమి పూజ చేయనున్నారు. ఢిల్లీ నుంచి వర్చువల్ ప్లాట్ ఫామ్ ద్వారా ఈ కార్యక్రమంలో గడ్కరీతోపాటు సీఎం కేసీఆర్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఎంపీలు, ఎమ్మెల్యేలు పాల్గొననున్నారు. 370 కిలోమీటర్ల విస్తీర్ణంలో రూ.3,717 కోట్లతో నిర్మించిన 6  ప్రాజెక్టులను జాతికి అంకితం చేయనున్నారు. 396 కిలోమీటర్ల పొడవున రూ.9,440 కోట్లతో నిర్మించాల్సిన 8 ప్రాజెక్టులకు గడ్కరీ భూమి పూజ చేయనున్నారు. దేశవ్యాప్తంగా 35వేల కిలోమీటర్ల నేషనల్ హైవేస్ ను భారత్‌మాలా ప్రాజెక్టులో భాగంగా డెవలప్ చేస్తుండగా, ఇందులో 1,400 కిలోమీటర్ల హైవేను రాష్ట్రంలో విస్తరించనున్నారు. రాష్ట్రంలో జాతీయ రహదారులు 2014 మే నెలకి ముందు 2,511 కి.మీ. ఉండగా.. ఇప్పుడు 3,910 కి.మీకి పెరిగాయి. 2014 ముందు ఉన్న రోడ్లతో పోలిస్తే ఇప్పుడు 55.71 శాతం హైవేస్ పెరిగాయి.

For More News..

రాష్ట్రంలో బీజేపీని అధికారంలోకి తేవడమే లక్ష్యం

ప్రతి నెలా వెయ్యెకరాల్లో టమాట వెయ్యాలె

సంక్రాంతి తర్వాత స్కూళ్లు, కాలేజీలు ఓపెన్!