మునుగోడు ఉపఎన్నిక పోలింగ్ కొనసాగుతోంది. 5 గంటల వరకు 77.55శాతం ఓటింగ్ నమోదైనట్లు అధికారులు ప్రకటించారు. పోలింగ్ కు ఇంకా గంట మాత్రమే సమయం ఉంది. 5 గంటల వరకు లక్షా 87 వేల 527 ఓట్లు పోలయ్యాయి. 2 గంటల్లో దాదాపు 18 శాతం పోలింగ్ పెరిగింది. పోలింగ్ సరళి ఉదయం కాస్త మందకొడిగా సాగినా మధ్యాహ్నం నుంచి పుంజుకుంది. ప్రస్తుతం పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరారు.
గ్రామాల్లో సమస్యలు పరిష్కరించట్లేదని పలుచోట్ల ఓటర్లు పోలింగ్ ను బహిష్కరించారు. గట్టుప్పల్ మండలం రంగంతండాలో గ్రామస్తులు ఎన్నికను బహిష్కరించారు. గ్రామంలో మౌలిక వసతులపై స్పష్టమైన హామీ ఇచ్చే వరకు ఓటు వేయమని గ్రామస్తులు తెలిపారు. మర్రిగూడ మండలం శివన్నగూడెం, చర్లగూడెం గ్రామంలో భూ నిర్వాసితులు ఆర్అండ్ఆర్ ప్యాకేజీ ఇవ్వాలంటూ నిరసన వ్యక్తం చేస్తూ ఓటింగ్కు దూరంగా ఉన్నారు.