ఆదిలాబాద్​జిల్లాలో 78 కిలోల గంజాయి దహనం

ఆదిలాబాద్​జిల్లాలో 78 కిలోల గంజాయి దహనం

ఆదిలాబాద్​ టౌన్, వెలుగు : ఆదిలాబాద్​జిల్లాలో పోలీసుల తనిఖీల్లో పట్టుబడ్డ గంజాయిని సోమవారం నిజామాబాద్ జిల్లా జక్రాన్ పల్లి శ్రీ మెడికేర్ సర్వీసెస్ సెంటర్ వద్ద దహనం చేసినట్లు డీసీఆర్​బీ డీఎస్పీ సీహెచ్.నాగేందర్​ తెలిపారు. 

జిల్లాలో 26 కేసుల్లో పట్టుబడ్డ 78 కిలోల 295 గ్రాముల గంజాయిని దహనం చేసినట్లు పేర్కొన్నారు. ఇందులో సీసీఎస్​ ఇన్​స్పెక్టర్ కె.పాండేరావు, ఎస్ఐ హకీమ్ పాల్గొన్నారు.