రూ. 7,800 కోట్లతో జిల్లా వార్షిక రుణ ప్రణాళిక: కలెక్టర్ వీరారెడ్డి

సంగారెడ్డి టౌన్, వెలుగు: 2023-–24 పైనాన్షియల్‌ ఇయర్‌‌కు గాను 7,800 కోట్లతో జిల్లా వార్షిక రుణ ప్రణాళికను ఆమోదించినట్లు  అడిషనల్‌ కలెక్టర్ వీరారెడ్డి తెలిపారు. సోమవారం  కలెక్టరేట్‌లో  డీసీసీ/డీఎల్‌ఆర్‌‌సీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రాధాన్యత రంగాలకు రూ.6,565 కోట్లు, ప్రాధాన్యేతర రంగాలకు రూ. 1235 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. ఇందులో వ్యవసాయ లాంగ్‌ టర్మ్ రుణాలకు రూ. 4,147 కోట్లు, సూక్ష్మ సంస్థలకు 516.60 కోట్లు, చిన్న సంస్థలకు 167.40 కోట్లు, మధ్యతరహా సంస్థలకు రూ. 326 కోట్ల రుణాలు ఇవ్వాలని నిర్ణయించామన్నారు.

ALSO READ:వింటేజ్ లుక్లో పవర్ స్టార్.. లుంగీలో అదరగొట్టిన మామా అల్లుడు 

  ఎంఎస్ఎంఈ కింద రూ. 1,010 కోట్లు, విద్యారుణాలకు రూ.85 కోట్లు, గృహ రుణాలకు 1270  కోట్లు, సామాజిక మౌలిక సదుపాయాల కల్పనకు రూ. 46 కోట్లు, పునరుత్పాదక శక్తికి రూ. 7  కోట్ల రుణాలు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు. ఎల్‌డీఎం గోపాల్ రెడ్డి, నాబార్డ్ ఏజీఎం కృష్ణ తేజ , ఆర్బీఐ ఏజీఎం అలీ బాబా, డీఆర్‌‌డీఏ,  ఇండస్ట్రీస్‌,  అగ్రికల్చర్‌‌, వెల్ఫేర్‌‌ అధికారులు, బ్యాంకర్లు  
పాల్గొన్నారు.