త్రివర్ణ శోభితం వాడవాడలా స్వాతంత్ర్య వేడుకలు

త్రివర్ణ శోభితం వాడవాడలా స్వాతంత్ర్య వేడుకలు
  •     జిల్లా కేంద్రాల్లో వేడుకలకు హాజరైన మంత్రులు, ప్రజాప్రతినిధులు
  •     అలరించిన విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు
  •     ఉత్తమ అవార్డుల అందజేత

78వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మువ్వన్నెల జెండాలు రెపరెపలాడాయి. గురువారం వాడవాడలా స్వాతంత్ర్య దిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాల్లో త్రివర్ణ పతాకాలను ఎగురవేసి సెల్యూట్‌ చేశారు. స్వాతంత్య్ర సమరయోధుల సేవలను కొనియాడారు. జిల్లా కేంద్రాలైన వరంగల్ లో రెవెన్యూ, జిల్లా ఇన్​చార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాస్​రెడ్డి, హనుమకొండలో దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, ములుగులో పంచాయతీ శాఖ మంత్రి సీతక్క, జనగామలో ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య

మహబూబాబాద్​లో ప్రభుత్వ విప్, డోర్నకల్ ఎమ్మెల్యే జాటోతు రామచంద్రు నాయక్, జయశంకర్​భూపాలపల్లి జిల్లాలో రాష్ట్ర అటవీ అభివృద్ది సంస్థ చైర్మన్ పొదెం వీరయ్య జెండా ఎగురవేశారు. అనంతరం పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. స్వాతంత్ర్య సమరయోధులను సన్మానించారు. వివిధ శాఖల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టాల్స్ లను పరిశీలించారు. బెస్ట్​ఎంప్లాయీస్​కి అవార్డులు అందజేశారు.

అనంతరం ఆయా ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల స్టూడెంట్లు చేపట్టిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి.  అదేవిధంగా నియోజకవర్గ కేంద్రాల్లో స్థానిక ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు, పార్టీ నేతలు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.    - వెలుగు, నెట్​వర్క్​