నిజామాబాద్ జిల్లాలో 79 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు

నిజామాబాద్ క్రైమ్, వెలుగు: న్యూ ఇయర్​వేడుకల సందర్భంగా నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ డివిజన్ పరిధిలో 79 మందిపై డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు చేసినట్లు డీసీపీ జయరాం తెలిపారు. నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా మొత్తం 750 మంది పోలీసులు విధులు నిర్వహించినట్లు చెప్పారు. బందోబస్తులో అడిషనల్​ డిప్యూటీ కమిషనర్, ముగ్గురు ఏసీపీలు, 10 మంది సీఐలు, 32 మంది ఎస్ఐలు 32 పాల్గొన్నారన్నారు. శాంతియుత వాతావరణంలో సెలబ్రేషన్స్ ​జరిగినట్లు చెప్పారు.