
గోదావరిఖని, వెలుగు: గోదావరిఖనిలోని ఫైవింక్లయిన్ ఏరియా నుంచి మంథని మీదుగా మహారాష్ట్రకు డీసీఎం వ్యాన్‌లో అక్రమంగా తరలిస్తున్న 79.50 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టుకున్నట్లు టాస్క్‌ఫోర్స్ పోలీసులు తెలిపారు. రేషన్‌బియ్యం తరలిస్తున్నారన్న సమాచారంతో టాస్క్‌ఫోర్స్ సీఐ రమేశ్‌బాబు ఆధ్వర్యంలో బుధవారం వాహన తనిఖీలు చేపట్టారు.
అనుమానాస్పదంగా కనిపించిన డీసీఎంను పోలీసులు చెక్ చేయగా రూ.3.08 లక్షల విలువ చేసే 79.50 క్వింటాళ్ల రేషన్ బియ్యం తరలిస్తున్నట్లు గుర్తించారు. డ్రైవర్ దేశెట్టి మారుతిని అదుపులోకి తీసుకోగా మంథని పరిసర ప్రాంతాల్లో రేషన్ బియ్యం సేకరించి మహారాష్ట్రకు తరలిస్తున్నట్లు తెలిపారు. ఈ కేసులో మంథనికి చెందిన రాచర్ల రమేశ్, ఓదెల మహేందర్, సిరోంచకు చెందిన ఎల్లంకి వీరన్ పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
రాయికల్, వెలుగు : రాయికల్ మండలం రామాజీపేట గ్రామంలో గుర్తు తెలియని వ్యక్తులు నిల్వచేసిన 12 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని బుధవారం అధికారులు పట్టుకున్నారు. స్వాధీనం చేసుకున్న బియ్యాన్ని స్థానిక డీలర్ కు అప్పగించినట్లు సివిల్ సప్లై డీటీ వరప్రసాద్ తెలిపారు.