బషీర్ బాగ్, వెలుగు: యువతితో వల వేసి సైబర్‌నేరగాళ్లు ఓ ప్రైవేట్ఉద్యోగి నుంచి రూ.7.27లక్షలు కొట్టేశారు. హైదరాబాద్ సైబర్ క్రైమ్ ఏసీపీ శివమారుతి తెలిపిన వివరాల ప్రకారం.. సిటీకి చెందిన ప్రైవేట్ ఉద్యోగి(45)కి ఇటీవల ఓ యువతి కాల్చేసింది. తర్వాత వాట్సాప్‌లో చాట్చేస్తూ దగ్గరయ్యింది. స్టాక్స్‌లో ఇన్వెస్ట్‌చేస్తే అధిక మొత్తంలో లాభాలు వస్తాయంటూ నమ్మబలికింది.
ఓ ఫ్రాడ్వెబ్సైట్లో ఇన్వెస్ట్చేయించింది. డాలర్స్‌లో లాభాలు చూపించింది. వాటిని డ్రా చేసేందుకు ట్యాక్స్, ఎక్స్చేంజ్పేరిట కొంత చెల్లించేలా చేసింది. అలా రూ.7,27,400 కట్టించింది. చివరికి తాను సైబర్‌నేరగాళ్ల వలలో పడ్డానని తెలుసుకున్న బాధితుడు
పోలీసులను ఆశ్రయించాడు.