గుడ్ న్యూస్: ఉద్యోగుల డీఏ పెంపు.. జీతం ఎంత పెరుగుతుందంటే..

గుడ్ న్యూస్: ఉద్యోగుల డీఏ పెంపు.. జీతం ఎంత పెరుగుతుందంటే..

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు అదిరిపోయే గుడ్ న్యూస్ ఇది..  ప్రభుత్వం హోలీ పండగకు ముందే డీఏ పెంచాలని నిరణించినట్లు తెలుస్తోంది. రెండు శాతం మేర డీఏ పెంపునకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ఆయా వర్గాల్లో చర్చ జరుగుతోంది.ప్రభుత్వ నిర్ణయంతో దేశవ్యాప్తంగా 1.2 కోట్లకు పైగా ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు లబ్ది చేకూరనుంది. 

హోలీకి ముందే డీఏ పెంపు:

ప్రతి సంవత్సరం జనవరి, జులైలో రెండు సార్లు డీఏ పెంచుతుంది కేంద్రం. ప్రతి ఏటా జనవరి నెలకు సంబంధించి డీఏ పెంపును హోలీ సమయంలో ప్రకటిస్తుంది ప్రభుత్వం. జులై నెలకు సంబంధించిన డీఏ పెంపును దీపావళి సమయంలో లేదా నవంబర్ నెలలో ప్రకటిస్తారు. కానీ.. ఈ ఏడాది హోలీ పండగకు ముందే ఫిబ్రవరి నెలలోనే డీఏ పెంపు ప్రకటించే ఛాన్స్ ఉందని తెలుస్తోంది.

ఇటీవల డీఏ ఎంత పెంచారంటే:

2024 సంవత్సరం మార్చి నెలలో హోలీ సందర్భంగా డీఏ 46 శాతం నుంచి 50శాతానికి పెంచింది ప్రబుత్వంన్. ఆ తర్వాత అక్టోబర్ లో మళ్ళీ 3 శాతం డీఏ పెంపు ప్రకటించింది కేంద్రం.ఈ క్రమంలో ప్రస్తుతం డీఏ 53 శాతంగా ఉంది. ఇక ఇప్పుడు రెండు శాతం డీఏ పెంపు ఉంటుందని వార్తలొస్తున్న క్రమంలో డీఏ 55 శాతం పెరుగుతుంది. 

Also Read:-తెలంగాణ ప్రజలకు మోదీ కృతజ్ఞతలు..

డీఏ పెంపు వల్ల ఉద్యోగుల ఆర్థిక స్థితిని మెరుగుపడుతుంది. పైగా పండుగ సమయంలో పెంచడం ద్వారా ఉద్యోగులకు ఆసరాగా ఉంటుంది. దీంతో ఉద్యోగులు పండగ సమయంలో కుటుంబంతో ఆనందంగా గడిపే అవకాశం ఉంటుంది. ఇదే పండగ సమయాల్లో డీఏ పంచటానికి గల కారణమని చెప్పచ్చు. 

జీతం ఎంత పెరుగుతుంది:

డీఏని రెండు శాతం పెంచితే.. రూ.18 వేలు బేసిక్ పే ఉన్నట్లయితే.. ఉద్యోగి జీతం రూ. 360 పెరుగుతుంది. అదే.. డీఏ 3శాతం పెంచితే రూ. 540 మేర ఉద్యోగి జీతం పెరుగుతుంది.