చందానగర్ వ్యాపారి ఇంట్లో డ్రగ్స్ పార్టీ.. 150 గ్రాములు సీజ్.. పరారీలో ఐదుగురు

చందానగర్ వ్యాపారి ఇంట్లో డ్రగ్స్ పార్టీ.. 150 గ్రాములు సీజ్.. పరారీలో ఐదుగురు


హైదరాబాద్ సిటీ నడిబొడ్డున.. చందానగర్ ప్రాంతం.. ఐటీ ఉద్యోగులు ఎక్కువగా ఉండే ఏరియా.. ఏకంగా ఓ  వ్యాపారి ఇంట్లోనే డ్రగ్స్ పార్టీకి ప్లాన్ చేశారు.. మందు పార్టీ అంటే కామన్ అనుకున్నారో ఏమో.. ఏకంగా డ్రగ్స్ పార్టీకి రెడీ అయ్యారు.. సిటీలోనే సంచలనంగా మారిన ఈ వ్యవహారంపై పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..

చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని  గుల్ మొహర్ పార్క్ లో నివాసం ఉంటున్న ఓ వ్యాపారి  ఇంట్లో డ్రగ్స్ పార్టీకి ప్లాన్ చేశారు. పక్కా సమాచారంతో ఆ ఇంటి పై దాడులు జరిపారు చందానగర్ పోలీసులు. రాజస్థాన్ నుండి కృష్ణారాం అనే వ్యక్తి  డ్రగ్స్ తెచ్చి నగరం  హైదరాబాద్లో  విక్రయిస్తున్నట్లు  పోలీసులు గుర్తించారు. 

ఘటనా స్థలంలో 18 లక్షల విలువ చేసే 150 గ్రాముల MDMA డ్రగ్స్ ను సీజ్ చేశారు.  ఈ కేసులో ముగ్గురిని అదుపులోకి తీసుకోగా మరో  ఐదుగురు పరారీలో ఉన్నారు.  డ్రగ్స్ కేసులో కృష్ణారాంతో పాటు మరో ఏడు మంది కేసు నమోదు చేశారు. మిగతా నిందితుల  కోసం గాలింపు చర్యలు చేపట్టారు చందానగర్ పోలీసులు.