బీట్‌రూట్ మన వంటకాల్లో ఎక్కువగా వాడని కూరగాయ. కానీ ఈ బీట్‌రూట్ వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ముఖ్యంగా ఈ జ్యూస్‌కు శరీరంలోని వ్యర్థాలను తరిమికొట్టే శక్తి ఉంది. బీట్‌రూట్‌లో యాంటీఆక్సీడెంట్స్‌తోపాటు విటమిన్ ఏ, బీ6, ఐరన్ పుష్కలంగా ఉంటాయి. అందుకే బీట్‌రూట్ జ్యూస్‌ను సూపర్ ఫుడ్‌లో చేర్చారు. ప్రోటీన్లు, కార్బొహైడ్రేడ్స్, ఫైబర్, ఫొలేట్, విటమిన్ సీ, కాల్షియం, మెగ్నీషియం, మాంగనీస్, జింక్ వంటివి కూడా ఇందులో అధిక మోతాదులో ఉన్నాయి. అలాంటి బీట్‌రూట్ వల్ల కలిగే పలు ప్రయోజనాలు ఏంటో తెలుసుకుందాం.
రక్తహీనతను తగ్గిస్తుంది: మన శరీరంలో హిమోగ్లోబిన్ శాతం తగ్గకుండా చూసుకోవాలి. బీట్‌రూట్‌లో ఉండే పోషకాలు రక్తహీనత బారిన పడకుండా చూసుకుంటాయి. బీట్‌రూట్‌లో ఉండే మినరల్స్, విటమిన్స్ శక్తిపోషకాలు. వీటిలో పొటాసియం ఫొటేస్ ఉంటాయి.
చర్మానికి రక్షణ: చర్మ రక్షణలో బీట్‌రూట్ చాలా ఉపయోగపడుతుంది. లోపలి చర్మాన్ని కాపాడటంలోనూ, ఫ్రీ రాడికల్స్ నుంచి చర్మాన్ని రక్షించడంలో బీట్ రూట్ జ్యూస్ తోడ్పడుతుంది. ఇందులో ఉండే లైకోపీన్ తీవ్రమైన ఎండల నుంచి మన చర్మాన్ని కాపాడుతుంది.
లైంగిక సామర్ధ్యాన్ని పెంచుతుంది: బీట్ రూట్‌లో బోరాన్ అనే ఖనిజం ఉంటుంది. అలాగే బీట్ రూట్ జ్యూస్ మన శరీరంలో నైట్రిక్ ఆక్సైడ్ ఉత్పత్తిని పెంచుతుంది. బోరాన్, నైట్రిక్ ఆక్సైడ్ రెండూ కూడా సెక్స్ హార్మోన్లను ఉత్తేజ పరుస్తాయి. ఫలితంగా ఆరోగ్యకరమైన సెక్స్ సామర్ధ్యాన్ని పెంచుకునేందుకు ఈ జ్యూస్ అద్భుతంగా పనిచేస్తుందని ఎన్నో పరిశోధనల్లో తేలింది.
బరువును తగ్గిస్తుంది: బరువు తగ్గాలనుకునే వారు బీట్ రూట్ జ్యూస్ తాగితే మంచిది. ఇందులో నైట్రేట్లు, బెటాలైన్స్ మన శరీరంలో రక్త ప్రవాహాన్ని పెంచుతాయి. కండరాల్లో ఆక్సిజన్ సరఫరా మెరుగవుతుంది. ఫలితంగ మన బాడీ చురుగ్గా తయారై, ఎక్సర్ సైజ్ చెయ్యడానికీ, అథ్లెట్లలా దూసుకుపోయేందుకూ వీలవుతుంది.