హర్యాణాలో ఘోరం జరిగింది. తీర్థయాత్రలకు వెళ్లివస్తున్న ఒకే కుటుంబానికి చెందిన 60మంది ప్రయాణిస్తున్న బస్సులో మంటలు చేలరేగాయి. హర్యానాలోని కుండలలి మనేసర్ పల్వాల్ ఎక్స్ ప్రెస్ వే మీద శుక్రవారం అర్ధరాత్రి బస్సు పూర్తిగా దగ్ధమైంది. బస్సులో ఉన్నవారంతా ఉత్తరప్రదేశ్ లోని మధుర, బృందావన్ టూర్ కు వెళ్లి సొంతరాష్ట్రమైన పంజాబ్ కు తిగురు ప్రయాణమైయ్యారు. బస్సులో మహిళలు, పిల్లలతో సహా బంధువులు 60 మంది ఉన్నారు.
Watch: Eight people were killed and around two dozen injured when a tourist bus caught fire in Nuh, Haryana. pic.twitter.com/on1DG64moK
— IANS (@ians_india) May 18, 2024
ఈ ప్రమాదంలో 8మంది చనిపోయారు. దాదాపు 20 మందికి గాయాలు అయ్యాయి. బస్సు వెనుక నుంచి పొగ వచ్చి నెమ్మదిగా మంటలు చెలరేగాయి. ఆ విషయం బస్సులో ఉన్నవారికి ఆలస్యంగా తెలిసింది. అది గమనించిన బైక్ పై వెళ్లి వ్యక్తి బస్సు డ్రైవర్ కు చెప్పారు. అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకొని మంటలు అర్పారు. అప్పటికే చాలామంది మంటల్లో చిక్కుకున్నారు. ప్రమాదంలో గాయపడ్డవారిని నుహ్‌లో ప్రభుత్వ హాస్పిటల్ లో చేర్పించారు. పోలీసులు ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు.