భూగోళంపై ఏడు ఖండాలున్నాయనేది తెలిసిందే.. ఈ ఏడు ఖండాల ఆధారంగా దేశాలను విభజించి మ్యాప్స్ తయారు చేశారు. ఇప్పుడు కొత్తగా మరో ఖండం తెరపైకి వచ్చింది. దీనికి జిలాండియా అని పేరు పెట్టారు. 2017లో భూగర్భ శాస్త్రవేత్తలు దీన్ని గుర్తించినా.. తాజాగా పూర్తిస్థాయిలో మ్యాపింగ్ చేశారు.
ఇప్పుడు సముద్రపు అడుగు భాగంలోని రాతి ఫలకాల నమూనాల డేటాను ఉపయోగించి.. జిలాండియాను ఖండంగా గుర్తించారు. దీని విస్తీర్ణాన్ని ఖరారు చేశారు. జిలాండియా ఖండం విస్తీర్ణాన్ని 50 లక్షల చదరపు కిలోమీటర్లుగా తేల్చారు.