హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ లో కరోనా పాజిటివ్ కేసులు రోజు రోజుకి పెరుగుతున్నాయి. గురువారం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మొత్తం 8 చోట్ల కరోనా టెస్టులు చేశారు అధికారులు. కేసులు అధికంగా వస్తున్న గ్రేటర్ తో పాటు నగర శివారు ప్రాంతాలైన మేడ్చల్, రంగారెడ్డి, వికారాబాద్ లో టెస్టులు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. పాజిటివ్ వచ్చిన వారి ప్రైమరీ.. సెకండరీ కాంటాక్ట్స్ కు టెస్టులు చేస్తున్నారు. ఎర్రగడ్డలో మూడు రోజుల్లో 581 మందికి, బేగంపేటలోని నేచర్ క్యుర్ హాస్పిటల్ లో 500 మందికి, సరోజినీ దేవి హాస్పిటల్ లో 770 మందికి కరోనా టెస్టులు చేశారు.
అలాగే చార్మినార్ లోని టీబి హాస్పిటల్ లో 640 మందికి, అంబర్ పేట్ లో 383 మందికి, జియాగూడలో 515 మందికి, మలక్ పేట్ లో 366 మందికి, గోల్కొండ ఏరియా హాస్పిటల్ లో ఈ మూడు రోజుల్లో 333 మందికి టెస్టులు చేసినట్లు తెలిపారు ఇంచార్జి అధికారులు.