ఉత్తరప్రదేశ్: లక్నో-ఆగ్రా ఎక్స్‌ప్రెస్‌వేపై శుక్రవారం(డిసెంబర్ 06) మధ్యాహ్నం ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. వాటర్ ట్యాంకర్‌ను డబుల్ డెక్కర్ స్లీపర్ బస్సు ఢీకొని ఎనిమిది మంది మరణించారు. మరో 19 మంది తీవ్రంగా గాయపడ్డారు. కనౌజ్ పరిధిలోని మిశ్రరాబాద్ గ్రామ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాద స్థలం దగ్గర గ్రామస్తులు కిక్కిరిసిపోయారు.
ALSO READ : బైక్‌ను తప్పించబోయి RTC బస్ బోల్తా.. 10 మంది మృతి.. 20 మందికి గాయాలు*
ముందు నీళ్లు చల్లుతూ వెళ్తున్న వాటర్ ట్యాంకర్‌ను డబుల్ డెక్కర్ బస్సు వెనకనుంచి ఢీకొట్టింది. దాదాపు 50 మంది ప్రయాణికులతో బస్సు లక్నో నుంచి ఢిల్లీ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రయాణికుల్లో ఎక్కువ మంది ఉపాధి కోసం ఢిల్లీకి వలస వెళ్తున్న వారే. డ్రైవర్ నిద్రమత్తులో ఉండటం వల్లే ఈ ప్రమాదం జరిగిందని ప్రత్యక్ష సాక్ష్యులు చెప్తున్నారు.
VIDEO | Uttar Pradesh: Several people were killed in a road accident on Agra-Lucknow expressway near Kannauj. More details awaited.
— Press Trust of India (@PTI_News) December 6, 2024
(Full video available on PTI Videos - https://t.co/n147TvrpG7) pic.twitter.com/8Rr8AAzxKy
గాయపడిన వారిని సైఫాయి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌కు తరలించారు. స్థానిక పోలీసులు, ఉత్తరప్రదేశ్ ఎక్స్‌ప్రెస్‌వేస్ ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ అథారిటీ (UPEIDA) అధికారులు ఘటనా స్థలంలో సహాయక చర్యలు చేపట్టారు. అదే మార్గంలో ప్రయాణిస్తున్న జలశక్తి మంత్రి స్వతంత్ర దేవ్ సింగ్ సహాయక చర్యలను పర్యవేక్షించేందుకు ఆగిపోయారు.