
మైదుగురి (బోర్నో): ఈశాన్య నైజీరియాలో ఇస్లామిక్ తీవ్రవాదులు రోడ్డు పక్కన అమర్చిన బాంబు పేలడంతో బస్సులో ప్రయాణిస్తున్న ఎనిమిది మంది చనిపోయారు. డజను మందికి పైగా గాయపడ్డారు. శనివారం బోర్నో రాష్ట్రంలోని డంబోవా–-మైదుగురి హైవేపై బస్సు ప్రయాణిస్తుండగా ఈ ఘటన జరిగిందని పోలీసుల ప్రతినిధి ఒక ప్రకటనలో తెలిపారు.
బోకోహరం గ్రూప్ నకు చెందిన ఇస్లామిక్ తీవ్రవాదులు పాశ్యాత్య విద్యను వ్యతిరేకించడంతో పాటు ఇస్లామిక్ చట్టాన్ని అమలు చేయాలని 2009లో ఆయుధాలు చేతపట్టారు. ఆఫ్రికాలో సుదీర్ఘకాలంగా పోరాటాన్ని కొనసాగిస్తున్నారు. నైజీరియాకు కూడా ఈ పోరాటం వ్యాపించింది.