Good Health : మీకు షుగర్ ఉంటే.. ఈ 8 రకాల డ్రైఫ్రూట్స్ అస్సలు తినొద్దు

ఒక్కసారి మధుమేహం వచ్చిందంటే దాన్ని శాశ్వతంగా వదిలించుకోవడం కష్టం. అయితే జీవనశైలిలో కొన్ని మార్పులు చేసుకుంటే శరీరంలో షుగర్‌ స్థాయులు పెంచకుండా కంట్రోల్‌ చేసుకోవచ్చు. ముఖ్యంగా ఆహారం పట్ల జాగ్రత్తగా ఉండాలి. తినడానికి రుచిగా ఉన్నప్పటికీ కొన్ని ఫుడ్స్‌ను కచ్చితంగా దూరం పెట్టాలి. అలాగే పోషక విలువలున్న ఆహారాన్ని డైట్‌లో తీసుకోవాలి.  అయితే మధుమేహం ఉన్నవారు కొన్ని  పండ్లను తినవద్దని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.  ఇప్పుడు అవి ఏంటో తెలుసుకుందాం. . .

ఎండుద్రాక్ష :  ఇందులో షుగర్​ కంటెంట్​ ఎక్కువుగా ఉంటుంది.  రక్తంలో త్వరగా కలిసిపోయి చక్కె స్థాయిని పెంచుతుంది.   అందువల  మధుమేహం ఉన్నవారు తమ ఆహారంలో ఎండుద్రాక్షను చాలా  మితంగా తీసుకోవాలి. అన్ని పండ్ల మాదిరిగానే ఎండుద్రాక్షలో సహజ చక్కెరలు, కార్బోహైడ్రేట్లు సమృద్ధిగా ఉంటాయి. మధుమేహం ఉన్నవారు రోజుకు 10గ్రాముల కన్నా తక్కువ తీసుకోవాలి. 

ఎండిన ఆప్రికాట్లు : ఇవి చాలా తియ్యగా ఉంటాయి.  వీటిలో గ్లూకోజ్​ కంటెంట్​ అధికంగా ఉంటుంది. ఆప్రికాట్లు చూసేందుకు చిన్నవి, గుండ్రంగా, బంగారు రంగులో ఉంటాయి. ఇది ప్రూనస్ కుటుంబంలో భాగం. ఇది కమ్మని తీపి రుచిని కలిగి ఉంటుంది. మధ్యప్రాచ్యం, ఆసియా, ఐరోపాలోని కొన్ని ప్రాంతాలలో సర్వసాధారణంగా కనిపిస్తాయి. డయాబెటీస్ ఉన్నవారు ఆప్రికాట్లు  తీసుకోవడం అంత మంచిది కాదంటున్నారు ఆరోగ్య నిపుణులు. డయాబెటిస్ ఉన్నవారికి సాధారణంగా రక్తంలో చక్కెర ఎక్కువ ఉంటుంది. ఇటువంటి వారుఆప్రికాట్లు  తింటే.. ఇవి రక్తంలో చక్కెర స్థాయిని మరింత పెంచుతాయి. ఆప్రికాట్లు  తినడానికి తియ్యగా ఉండడం వల్ల డయాబెటిస్ ఉన్నవాళ్లు ఖర్జూరం అస్సలు తీసుకోకూడదు అని చాలా మంది అనుకుంటారు. ఐతే తక్కువ మోతాదులో వీటిని తినడం వల్ల ఎలాంటి ప్రమాదం ఉండదు. మోతాదుకు మించితిన్నారంటే మాత్రం తిప్పలు తప్పవు. వ్యాయామానికి ముందు, రాత్రి నిద్రపోయే ముందు, అలాగే బ్రేక్‌ ఫాస్ట్‌లో 1 లేదా 2 ఆప్రికాట్లును తీసుకోవచ్చు.

ఖర్జూరం పండ్లు :  ఇవి సహజంగా  తీపి స్వభావాన్ని కలిగి ఉంటాయి.  రక్తంలో ..చక్కెర కలవడంతో దీని  ప్రభావం మధుమేహం ఉన్నవారికి ఆందోళన కలిగిస్తుంది. ఫ్రక్టోజ్  అనే ఎంజైమ్​  ఈ పండ్లలో కనిపించే చక్కెర రకం. ప్రతి  ఖర్జూరం పండులో 67 కేలరీలు, దాదాపు 18 గ్రాముల పిండి పదార్థాలు ఉంటాయి. మధుమేహం ఉన్నవారిలో రక్తంలో చక్కెర స్థాయిలను నిర్వహించడం సవాలుగా మారుతుంది. ఇలాంటి వారు ఖర్జూరం పండ్లను తినేటప్పుడు వైద్యుల సలహా తీసుకోవడం చాలా అవసరం. 

ఎండిన అత్తి పండ్లు:  దీనిని అంజీరా పండు అంటారు.   ఎండిన అత్తి పండ్లలో చక్కెర అధికంగా ఉంటుంది, ఇది అధికంగా తీసుకుంటే రక్తంలో చక్కెరను పెంచుతుంది. మధుమేహంతో బాధపడేవారు ఎండిన అత్తి పండ్లను మితంగా తినాలి.  ఈ రుచికరమైన పండు అధికంగా తీసుకుంటే రక్తంలో చక్కెర పెరుగుతుంది. ఇందులో అధిక మొత్తంలో కార్బోహైడ్రేట్లు ఉంటాయి. ఇది రక్తంలో త్వరగా కరుగుతుంది. గ్లూకోజ్‌ని పెంచుతుంది

ప్రూనే ప్రూనే:  వీటిలో కార్బొహైడ్రేట్లు, స్వీట్​ కంటెంట్​ అధికంగా ఉంటాయి.  ఇది ఎండిన ప్లం ఫ్రూట్.  ఇవి తింటే  మనల్ని డీహైడ్రేట్ చేయడానికి సహాయపడుతుంది. అయితే మధుమేహ వ్యాధిగ్రస్తుల ఆరోగ్యానికి ఇది మంచిది కాదు. దాని జీఐ(Glycemic index) మారుతుంది. మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఇది చాలా ప్రమాదకరమని వైద్య నిపుణులు అంటున్నారు.  మీరు ఈ పండ్లను తిన్న వెంటనే రక్తంలో చక్కెర 200 mg/dL కంటే ఎక్కువగా ఉంటుంది.

ఎండిన మామిడిపండ్లు: మామిడిని పండ్లలో రారాజుగా పిలుస్తారు. కానీ మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఇది మంచి పండు కాదు. ఇది అధిక మొత్తంలో సహజ చక్కెరను కలిగి ఉంటుంది. చాలా జాగ్రత్తగా ఉండాలి. అధిక GI విలువ ఉన్నందున దానిని తీసుకునే ముందు వైద్యుని సలహా తీసుకోండి.

క్రాన్‌బెర్రీస్ : వీటిలో షుగర్​ కంటెంట్​అధికంగా ఉంటుంది.  మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఇది చాలా ప్రమాదకరమని డాక్టర్లు అంటున్నారు రక్తంలో త్వరగా కలిసి... షుగర్​ లెవల్స్​ ను పెంచుతుంది,  ఇది తిన్న వెంటనే జీఐ (Glycemic index)లెవల్స్ మారుతాయి.   ఈ రుచికరమైన పండు అధికంగా తీసుకుంటే రక్తంలో చక్కెర పెరుగుతుంది. ఇందులో అధిక మొత్తంలో కార్బోహైడ్రేట్లు ఉంటాయి. ఇది రక్తంలో త్వరగా కరుగుతుంది. గ్లూకోజ్‌ని పెంచుతుంది.

ఎండిన పైనాపిల్స్:  ఇవి సాధారణంగా తియ్యగా ఉంటాయి. వీటిలో  చక్కెర కంటెంట్​ అధికంగా ఉంటుంది.  ఇది  మధుమేహంతో బాధపడువారు అసలు తినవద్దని వైద్యులు సూచిస్తున్నారు.  ఒక అధ్యయనం ప్రకారం, ఎండిన పైనాపిల్స్  తినడం వల్ల రక్తంలో చక్కెర పెరుగుతుంది. ఎందుకంటే ఇందులో చాలా కార్బోహైడ్రేట్లు ఉంటాయి