పెళ్లి రోజు కదా అని కుటుంబ సభ్యులతో కలసి ఓ వ్యక్తి హోటల్ కు వెళ్ళాడు. బిర్యానీ ఆర్డర్ చేసి తిన్నారు.... కొద్ది సేపటికే వాంతులు, విరోచనాలు అయ్యాయి... అవస్థలు పడి ఆసుపత్రి లో చేరారు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణంలో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళితే.. షాద్ నగర్ పరిధిలోని అప్పరెడ్డిగూడా గ్రామానికి చెందిన కావలి నరేందర్.. మే22వ తేదీన బుధవారం రోజు రాత్రి 9 గంటల సమయంలో తన కుటుంబ సభ్యులను షాద్ నగర్ పట్టణంలోని సాయిబాబా ఫ్యామిలీ రెస్టారెంట్ కు తీసుకెళ్లాడు. కుటుంబంతో కలిసి హోటల్ లో మండి బిర్యానీ తిన్నారు. తర్వాత ఇంటికి చేరుకున్న క్రమంలో ఒకరి తర్వాత ఒకరికి వాంతులు విరేచనాలు అయ్యాయి. దీంతో శంషాబాద్ ని ప్రైవేట్ ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యారు.
Also Read:లేట్ ఫీజులకు వడ్డీనా.. ? : వడ్డీ వ్యాపారులా లేక స్కూల్ యాజమాన్యాలా..?
అప్పటికే నరేందర్ కు రక్తపు వాంతులు విరేచనాలు కావడంతో ఐసీయూలో చికిత్స పొందుతున్నాడు. ఆయనతోపాటు ఆయన భార్య మంగమ్మ, కుటుంబ సభ్యులు దీక్షిత, తన్విక, అనిరూద్, అభిలాష్, జోష్ణ, సాయి శ్రీకర్ మొత్తం 8 మందికి అస్వస్థత కావడంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. సమాచారం అందుకున్న ఫుడ్ సేఫ్టీ అధికారులు హోటల్ లో తనిఖీలు చేపట్టారు.