హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో 8 మంది ఐఏఎస్‌లను, ఒక స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్‌ను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సీసీఎల్ సెక్రటరీగా ఉన్న బి. గోపి.. కరీంనగర్ కలెక్టర్‌గా బదిలీ అయ్యారు.
ఈ స్థానంలో ఉన్న ఆర్వీ. కర్ణన్ నల్లగొండ జిల్లా కలెక్టర్‌గా వెళ్లారు. ఇక కరీంనగర్ అదనపు కలెక్టర్‌గా ప్రఫుల్ దేశాయ్, జీహెచ్‌ఎంసీ అదనపు కమిషనర్‌గా వెంకటేశ్ ధోత్రే, సూర్యాపేట అదనపు కలెక్టర్‌గా చెక్కా ప్రియాంక, ఆసిఫాబాద్ అదనపు కలెక్టర్‌గా హేమంత కేశవ్ పాటిల్ నియమితులయ్యారు.
ALSO READ :అనిల్ రెడ్డికి ఎంపీ సీటు ఆఫర్!
పెద్దపల్లి అదనపు కలెక్టర్‌గా అరుణ శ్రీ, స్పెషల్‌గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ రమేశ్ మెదక్ జిల్లా అదనపు కలెక్టర్‌గా అపాయింట్ అయ్యారు. నల్గొండ కలెక్టర్‌గా ఉన్న వినయ్ కృష్ణారెడ్డిని జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్‌మెంట్‌లో రిపోర్ట్ చేయాలని పేర్కొన్నారు.