ప్యాసింజర్లతో వెళ్తున్న ఆటోను ఢీకొన్న ట్రక్కు.. ఎనిమిది మంది మృతి

మరో ఏడుగురికి గాయాలు..  మహారాష్ట్రలో ఘటన

ముంబై: మహారాష్ట్రలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా వెళ్తున్న ట్రక్కు ప్యాసింజర్లతో వెళ్తున్న ఆటోను ఢీకొట్టడంతో ఎనిమిది మంది మృతి చెందారు. మరో ఏడుగురికి గాయాలయ్యాయి. ఆదివారం మధ్యాహ్నం రత్నగిరి జిల్లా దపోలి -హర్నై రోడ్‌‌‌‌‌‌‌‌లోని అసుద్ వద్ద ఈ యాక్సిడెంట్​జరిగింది. 15 మంది ప్యాసింజర్లతో హర్నై నుంచి దపోలి వైపు వెళ్తున్న ట్రక్కు.. రాంగ్​ రూట్​లో వెళ్తూ త్రీవీలర్​ ఆటోను ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు.

ALSO READ:తప్పు చేస్తే శిక్ష అనుభవించాల్సిందే.. పొంగులేటిపై పువ్వాడ పరోక్ష కామెంట్స్

ఐదుగురు ప్రయాణికులు స్పాట్​లోనే చనిపోగా, మరో ముగ్గురు ఆసుపత్రిలో మరణించారని చెప్పారు. కాగా, ప్రమాదం విషయం తెలిసి బాధిత కుటుంబాలకు మహారాష్ట్ర సీఎం ఏక్‌‌‌‌‌‌‌‌నాథ్ షిండే సంతాపం తెలిపారు. మరణించిన వారి కుటుంబాలకు సీఎం రిలీఫ్​ ఫండ్​ నుంచి రూ.5 లక్షల చొప్పున ఎక్స్‌‌‌‌‌‌‌‌గ్రేషియా ప్రకటించారు.