ఐక్య వ్యాపార సంఘ భవనానికి 8 లక్షల విరాళం

లక్సెట్టిపేట, వెలుగు : లక్సెట్టిపేట పట్టణంలో వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయ సమీపంలో నిర్మిస్తున్న ఐక్య వ్యాపార సంఘ భవన నిర్మాణానికి స్థానిక వ్యాపారి, ఐక్య వ్యాపార సంఘం గౌరవ అధ్యక్షుడు కొత్త వెంకటేశ్వర్లు గురువారం రూ.8 లక్షలు 11 వేలను విరాళంగా అందజేశారు.

వ్యాపార సంఘం అభివృద్ధికి తన శాయశక్తులా కృషి చేస్తానని తెలిపారు. మున్సిపల్ చైర్మన్ నల్మాస్ కాంతయ్య, మైలారపు సుధాకర్, పల్లెర్ల మహేందర్, తాటికొండ శ్రీనివాస్, పల్లెర్ల సురేశ్, శ్రీనివాస్, హరిప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.