రవాణా శాఖలో 8 మందికి ప్రమోషన్‌‌‌‌

  • జేటీసీలుగా ఇద్దరికి,డీటీసీలుగా ఆరుగురికి
  • మూడేండ్ల తర్వాత పదోన్నతులు కల్పించడంపై అధికారుల హర్షం

హైదరాబాద్, వెలుగు: రవాణా శాఖలో ఎనిమిది మంది అధికారులకు పదోన్నతులు లభించాయి. ఈ మేరకు గురువారం రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రవాణా శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ వికాస్ రాజ్ ఈ ప్రమోషన్ల జాబితాకు ఆమోద మోద్ర వేయడంతో త్వరలో వీరికి పోస్టింగ్‌‌‌‌లు ఇవ్వనున్నారు. మరో వారం, పది రోజుల్లో ఎంవీఐలకు ఆర్టీఏలుగా ప్రమోషన్లు ఇచ్చే అవకాశం ఉంది. దాదాపు మూడేండ్ల తర్వాత రవాణా శాఖలో పదోన్నతలు లభించడంతో ట్రాన్స్‌‌‌‌పోర్టు ఆఫీసర్లు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Also Read : రామగుండంలో ఎయిర్​పోర్ట్ ఏర్పాటు చేయండి

ప్రస్తుతం డీటీసీలుగా ఉన్న మామిండ్ల చంద్రశేఖర్ గౌడ్, శివ లింగయ్యకు జేటీసీలుగా పదోన్నతి పొందారు. ఇక ఆర్టీఏలుగా ఉన్న రవీందర్ గౌడ్, వాణి, సదానందం, కిషన్, సురేశ్ రెడ్డి, ఆఫ్రిన్‌‌‌‌కు డీటీసీలుగా ప్రమోషన్ లభించింది. ప్రమోషన్ల కల్పనలో ప్రత్యేక చొరవ తీసుకున్న రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌‌‌‌‌‌‌‌ను గురువారం హైదరాబాద్‌‌‌‌లోని మినిస్టర్స్ క్వార్టర్స్‌‌‌‌లో పదోన్నతి పొందిన అధికారులు కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ప్రమోషన్ పొందిన అధికారులకు మంత్రి పొన్నం అభినందనలు తెలుపుతూ.. రవాణా శాఖ ప్రతిష్టను పెంచేలా పని చేయాలని వారికి సూచించారు.