8 నెలల గర్భిణి..గుండెపోటుతో నటి మృతి

 8 నెలల గర్భిణి..గుండెపోటుతో నటి మృతి

మలయాళ చిత్ర పరిశ్రమలో మరో విషాదం చోటుచేసుకుంది . ప్రముఖ టీవీ నటి నటి డాక్టర్ ప్రియ గుండెపోటుతో మరణించింది. 35 ఏళ్ల ప్రియ  ప్రస్తుతం ఎనిమిది నెలల గర్భిణి. 2023 అక్టోబర్ 31న   రెగ్యులర్ ప్రెగ్నెన్సీ చెక్-అప్  కోసం ఆసుపత్రికి వెళ్లిన  ప్రియ ఉన్నటుండి అక్కడ ఒక్కసారిగా కుప్పకూలి చనిపోయింది.   దీంతో వైద్యులు అపరేషన్ చేసి శిశువును బయటకు తీశారు. శిశువు ఐసీయూలో చికిత్స పొందుతుంది.  

ఒక్కగానొక్క కూతురు చనిపోవడంతో ప్రియ తల్లి కుప్పకూలిపోయింది. గత ఆరు నెలలుగా ఆమెను చూసుకుంటున్న భర్త పడుతున్న బాధ వర్ణించలేనిదని ఆవేదన వ్యక్తం చేసింది.  కాగా  మళయాళీ  టీవీ  పరిశ్రమలో  పాపులర్ నటులలో  డాక్టర్ ప్రియ ఒకరు. పాపులర్ షో కరుతముత్తులో కిషోర్‌తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంది. ఇటీవల, ఆమె తన వివాహం తర్వాత పరిశ్రమ నుండి విరామం తీసుకుంటూ కనిపించింది. ప్రియా వృత్తిరీత్యా డాక్టర్‌ కూడా. 

ALSO READ :- Kalki Update: ప్రభాస్ కల్కి నుంచి అప్డేట్ ఇచ్చిన మేకర్స్..