
- ఇప్పటివరకు 14 మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
హైదరాబాద్ సిటీ, వెలుగు: చిలుకూరి బాలాజీ టెంపుల్ ప్రధాన అర్చకుడు రంగరాజన్‌పై జరిగిన దాడి కేసులో మరో 8 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. బుధవారం ఆ వివరాలను రాజేంద్రనగర్ డీసీపీ వెల్లడించారు. అరెస్టయిన వారిలో ఏపీలోకి శ్రీకాకుళానికి చెందిన ఐదుగురు, తెలంగాణలోని వరంగల్‌కు చెందిన ఒకరు, భద్రాచలానికి చెందిన ఇద్దరు ఉన్నారు. వీరి నుంచి రెండు కార్లను స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటివరకు మొత్తం 14 మందిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు.