ఇరాన్​లో 8 మందిపాక్​ కార్మికుల హత్య

ఇరాన్​లో 8 మందిపాక్​ కార్మికుల హత్య

ఇస్లామాబాద్: ఇరాన్ లో ఎనిమిది మంది పాకిస్తానీ కార్మికులను బలూచ్ మిలిటెంట్లు హత్య చేశారు. ఈ ఘటన  శనివారం సిస్తాన్-– బలూచిస్తాన్ ప్రావిన్స్‌‌‌‌‌‌‌‌ మెహరిస్తాన్ జిల్లాలోని ఒక గ్రామంలో చోటు చేసుకుంది. ఇరాన్ అధికారులు కూడా ఈ ఘటనను నిర్ధారించారు. మరణించిన కార్మికులు పాకిస్తాన్ దక్షిణ పంజాబ్ లోని బహవల్ పూర్ సిటీకి చెందినవారని తెలిపారు. కార్ల వర్క్ షాపులో వారు పని చేస్తున్నారని చెప్పారు. శనివారం రాత్రి గుర్తు తెలియని సాయుధులు వర్క్ షాపులోకి wచొరబడి కార్మికుల చేతులు, కాళ్లను కట్టేసి వారిపై విచక్షణా రహితంగా కాల్పులు జరిపి హత్య చేశారు. అనంతరం అక్కడి నుంచి పారిపోయారు.

ఈ ఘటన గురిచి సమాచారం అందుకున్న ఇరాన్ పోలీసులు వెంటనే స్పాట్ కు చేరుకున్నారు. దీనిపై కేసును నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ మారణకాండకు తామే బాధ్యత వహిస్తున్నట్టు నిషేధిత బలూచిస్తాన్ నేషనల్ ఆర్మీ ప్రకటించింది. అందుకు సంబంధించి మీడియాకు ఒక ప్రకటన విడుదల చేసింది. సిస్తాన్– బలూచిస్తాన్‌‌‌‌‌‌‌‌ ప్రావిన్స్ లో ఇది రెండో సంఘటన. గతేడాది జనవరిలో సాయుధ వ్యక్తులు సరవాన్ సిటీలో తొమ్మిది మంది పాకిస్తానీలను చంపేశారు.