![డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరికిన 8 మందికి జైలు శిక్ష](https://static.v6velugu.com/uploads/2025/02/8-people-caught-drunk-and-driving-in-khammam-district-sentenced-to-jail_MHXdP0JlTe.jpg)
ఖమ్మం, వెలుగు : డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో పట్టుబడిన ఎనిమిది మందికి రెండు రోజులు జైలు శిక్ష, ఒక్కొక్కరికి రూ.రెండు వేల చొప్పున జరిమానా విధిస్తూ సోమవారం ఖమ్మం రెండవ అడిషనల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ వై. బిందుప్రియ తీర్పు ఇచ్చారు. ఇటీవల ఖానాపురం హవేలీ పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో 8 మంది పట్టుడ్డారు.
వారికి కౌన్సెలింగ్ నిర్వహించిన తర్వాత మెజిస్ట్రేట్ ఎదుట హాజరు పరిచామని సీఐ భానుప్రకాశ్ తెలిపారు. శిక్ష పడిన వారిలో ఇమ్రాన్ ఖాన్, వీరబాబు, నాగభాశివ, శ్రీనివాస్, నరసింహ, మిధున్, రాజు, క్రిష్ణరావు వున్నారు.