![బంగ్లాదేశ్‌లో ట్రాలర్ బోటు బోల్తా](https://static.v6velugu.com/uploads/2023/08/Dhaka-Bangladesh_9ca2zBfqUS.jpg)
- ముగ్గురు పిల్లలు సహా 8మంది మృతి
ఢాకా: బంగ్లాదేశ్ ఢాకాలో జరిగిన బోటు ప్రమాదంలో 8మంది మృతిచెందారు. 46మందితో ప్రయాణిస్తున్న ట్రాలర్ బోటు పద్మనదిలో ఇసుక బోటును ఢీకొట్టి బోల్తాపడింది. ఈ ఘటనలో ముగ్గురు పిల్లలతో సహా 8 మంది ప్రాణాలు కోల్పోయారు. ఢాకా డివిజన్ మున్షిగంజ్ జిల్లాలో శనివారం రాత్రి సుమారు 8.30 ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. ఎనిమిది మృతదేహాలను వెలికి తీశామని, ఇందులో నాలుగు డెడ్‌బాడీలను స్థానిక ఆసుపత్రికి తరలించామని అధికారులు తెలిపారు.
నదిలో ప్రవాహం ఉధృతంగా ఉండటంతో ఫైర్ సర్వీస్, సివిల్ డిఫెన్స్ చేపట్టిన రెస్క్యూ ఆపరేషన్ ఆదివారం ఉదయం 2 గంటల ప్రాంతంలో నిలిపివేశారు. ఈమేరకు ఢాకా ట్రిబ్యూన్ న్యూస్‌పేపర్ వెల్లడించింది. సిర్జాదీఖాన్కు చెందిన ప్యాసింజర్లు బోటులో పిక్నిక్ వెళ్లి తిరిగి వస్తుండగా ప్రమాదం జరిగిందని, బోటులో ఉన్న చాలామంది ఈదుకుంటూ ఒడ్డుకు చేరుకున్నారని మున్షిగంజ్ పోలీసులు తెలిపారు.