8 శాతం మంది.. 60 శాతం మందికి కరోనా అంటించిన్రు

దేశంలో కరోనా కేసులు పెరగడానికి సూపర్ స్ప్రెడర్స్ కారణం

ఏపీ, తమిళనాడులో జరిపిన స్టడీలో సైంటిస్టుల వెల్లడి

న్యూఢిల్లీ: మన దేశంలో ఇప్పటి వరకు కరోనా సోకిన వారిలో 60 శాతం మందికి కేవలం 8 శాతం మంది సూపర్ స్ప్రెడర్స్ నుంచే అంటిందని ఓ స్టడీలో తేలింది. కరోనా విస్ఫోటనం వెనుక సూపర్ స్ప్రెడర్స్ ఉన్నారని జర్నల్ సైన్స్‌‌‌‌లో పబ్లిష్ అయిన స్టడీలో సైంటిస్టులు పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వాల సాయంతో చేపట్టిన స్టడీలో సెంటర్  ఫర్ డిసీజ్ డైనమిక్స్, ఎకనామిక్స్ అండ్ పాలసీ (సీడీడీఈపీ), జాన్ హాప్ కిన్స్ బ్లూమ్ బర్గ్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్, ప్రిన్స్ టన్ యూనివర్సిటీ సైంటిస్టులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్, తమిళనాడులో 30 లక్షలకుపైగా కాంటాక్ట్ కేసులను ట్రేస్ చేసి సైంటిస్టులు స్టడీ చేశారు. ‘ఇదివరకు కరోనాపై ఎక్కువ రీసెర్చ్ లు చైనా, యూరప్, నార్త్ అమెరికాలోనే జరిగాయి. మన దేశంలో వైరస్ ట్రాన్స్ మిషన్ పై స్టడీ జరగడం ఇదే తొలిసారి. ప్రసుతం ఇండియాతోపాటు ఇతర డెవలపింగ్ కంట్రీస్ లో కరోనా కేసులు పెరుగుతున్నాయి’ అని స్టడీని లీడ్ చేసిన సెంటర్  ఫర్ డిసీజ్ డైనమిక్స్, ఎకానమిక్స్ అండ్ పాలసీ డైరెక్టర్ రమణన్ లక్ష్మీనారాయణన్ చెప్పారు. ఈ కంట్రీస్ లో హెల్త్ కేర్ కు అడ్డంకులు ఉన్నాయని, కరోనా సోకితే అస్వస్థతకు గురై చనిపోయే రిస్క్ ఎక్కువగా ఉంటుందన్నారు. కొందరు వైరస్ ను పెద్ద ఎత్తున ట్రాన్స్ మిట్ చేశారని తెలిపారు. కరోనా సూపర్ స్ప్రెడర్స్ సంఖ్య తక్కువగానే ఉందని, 71 శాతం కన్ఫామ్ కేసుల్లో కాంటాక్ట్స్ ట్రేస్ చేస్తే వాళ్ల ద్వారా ఎవరికీ వైరస్ స్ప్రెడ్ కాలేదని తేలినట్లు చెప్పారు. 15 మందిలో ఒకరికి కరోనా సోకినట్లు దేశవ్యాప్తంగా నిర్వహించిన సెరోలాజికల్ సర్వే చెబుతోందన్నారు.

క్లోజ్ కాంటాక్ట్‌లోకి వచ్చినవారికి సోకిన వైరస్

ఏపీ, తమిళనాడులో తొలి కరోనా కేసులు మార్చి 5న నమోదయ్యాయని లక్ష్మీనారాయణన్ చెప్పారు. ఈ రాష్ట్రాల్లో ప్రతి కన్ఫామ్ కేసుకు 80 కాంటాక్ట్ కేసులను హెల్త్ వర్కర్లు ట్రేస్ చేశారని తెలిపారు. బస్సులు ఇతర రవాణా సదుపాయాల్లో ఎక్కువ సేపు క్లోజ్ గా కాంటాక్ట్ అయినవారికి వైరస్ వేగంగా వ్యాప్తి చెందిందన్నారు. బయటి వ్యక్తుల్లో 40 మందిలో ఒకరి నుంచి కరోనా సోకినట్లు తమ స్టడీలో తేలిందన్నారు. 14 ఏళ్లలోపు పిల్లలు సైలెంట్ స్ప్రెడర్స్ గా తమ పేరెంట్స్ తోపాటు తమ తోటివాళ్లకు వైరస్ అంటించారని పేర్కొన్నారు. స్కూల్స్ మూసివేసినా.. పిల్లల నుంచి పిల్లలకు వైరస్ ట్రాన్స్ మిషన్ అయినట్లు తెలిపారు.

For More News..

బలరాంపూర్ అత్యాచార బాధితురాలు మృతి

హత్రాస్ బాధితురాలి అంత్యక్రియలు అర్ధరాత్రి ఎందుకు చేసిన్రు