- చత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని రాజనంద్‌గావ్ జిల్లాలో ఘటన
భద్రాచలం, వెలుగు : పిడుగుపడి ఒకే చోట 8 మంది దుర్మరణం పాలయ్యారు. ఈ ఘటన చత్తీస్‌గఢ్ రాష్ట్రంలో జరిగింది. రాజనంద్‌గావ్ జిల్లా జోరాతరాయి గ్రామంలో సోమవారం భారీ వర్షం పడింది. దీంతో గ్రామంలోని కొందరు వ్యక్తులు సమీపంలో ఉన్న పాన్ షాప్ వద్దకు చేరుకున్నారు. ఈ టైంలో ఉరుములు, మెరుపులతో కూడిన పిడుగు పాన్‌షాపు మీద పడింది.
దీంతో 8 మంది స్పాట్‌లోనే చనిపోగా, ఓ వ్యక్తి గాయపడ్డారు. చనిపోయిన వారిలో ఐదుగురు స్టూడెంట్లు ఉన్నారు. గాయపడిన వ్యక్తిని హాస్పిటల్‌కు తరలించారు. విషయం తెలుసుకున్న రాజనందగావ్ కలెక్టర్, ఎస్పీ ఘటనాస్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు.