8 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత

తల్లాడ, వెలుగు : అక్రమంగా తరలిస్తున్న 8 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని మంగళవారం తెల్లవారుజామున తల్లాడ పోలీసులు పట్టుకున్నారు. ఎస్సై కొండలరావు తెలిపిన వివరాల ప్రకారం..  తల్లాడ మండలం మల్లారం గ్రామానికి చెందిన రేషన్ డీలర్ పూనాటి రామారావు రేషన్ షాపు నుంచి ఎనిమిది క్వింటాళ్ల రేషన్ బియ్యం మినీ వ్యాన్ లో తరలిస్తున్నారు. ఈ విషయంపై పక్కా సమాచారం అందుకున్న పోలీసులు దాడి చేసి స్వాధీనం చేసుకున్నారు. డీలర్ రామారావు, అదే గ్రామానికి చెందిన వ్యాన్ డ్రైవర్ మధు పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.