
- ఫ్యామిలీ కోసం సొంత పార్టీ కార్యకర్తలనే మోసం చేసిండు: ఎమ్మెల్యే యెన్నం
హైదరాబాద్, వెలుగు : కేసీఆర్ తన కుటుంబం కోసం బీజేపీ దగ్గర సుపారీ తీసుకొని లక్షలాది మంది బీఆర్ఎస్ కార్యకర్తలను మోసం చేశారని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి ఆరోపించారు. అందుకే పాలమూరులో తమ కాంగ్రెస్ పార్టీఅభ్యర్థి ఓడిపోయారని ఆయన పేర్కొన్నారు. కేసీఆర్మద్దతుతోనే బీజేపీ 8 సీట్లలో గెలిచిందన్నారు. గురువారం గాంధీ భవన్ లో మీడియాతో శ్రీనివాస్ రెడ్డి మాట్లాడారు.
బీజేపీ, బీఆర్ఎస్ ఎన్ని కుట్రలు చేసినా అసెంబ్లీ ఎన్నికల్లో 65 స్థానాల్లో, లోక్సభ ఎన్నికల్లో 8 సీట్లలో ప్రజలు కాంగ్రెస్ ను గెలిపించారని ఆయన పేర్కొన్నారు. అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే కాంగ్రెస్ కు ఓట్ల శాతం పెరిగిందని ఆయన తెలిపారు. శ్రీరాముడి పేరు చెప్పి ఓట్లు అడిగిన బీజేపీ 8 సీట్లలో గెలిచిందని
వాళ్లది వాపు కాదని.. బలుపని గుర్తు పెట్టుకోవాలని ఆయన హెచ్చరించారు. కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు సామాజిక న్యాయం చేయలేదని, ఇప్పటికైనా బీఆర్ఎస్ అధ్యక్ష పదవిని దళితులకు ఇచ్చి సామాజిక న్యాయం చేయాలన్నారు.