సెల్ఫోన్ ప్రియులకు గుడ్ న్యూస్..అప్డేటెడ్ టెక్నాలజీతో వస్తున్న కొత్త స్మార్ట్ ఫోన్లకోసం ఎదురు చూస్తున్నారా..బడ్జెట్, లేటెస్ట్ ఫీచర్లు, బ్యాటరీ బ్యాకప్, లేటెస్ట్ కెమెరాలున్న స్మార్ట్ ఫోన్లకు కస్టమర్లు ఎక్కువగా ఇష్టపడుతుంటారు. ఇప్పటివరకు అలాంటి వచ్చినా.. ఎప్పటికప్పుడు అప్డేటెడ్ ఫోన్లకోసం ఎదురు చూస్తుంటారు..ఇలాంటి వారి కోసం రాబోయే రోజుల్లో అంటే ఈ సంవత్సరం మొత్తం లో ప్రతి నెలా కొత్త ఫోన్లు రిలీజ్ చేసేందుకు స్మార్ట్ ఫోన్ తయారీ కంపెనీలు ప్లాన్ సిద్దం చేశాయి. రాబోయే ఆరు నెలల్లో మార్కెట్లోకి రానున్న కొన్ని ప్రముక కంపెనీలకు చెందిన స్మార్ట్ ఫోన్ల గురించి తెలుసు కుందాం..
గూగుల్ Pixel 9 , గూగుల్ Pixel 9 Pro :
గూగుల్ సంస్థ Pixel 9 సిరీస్ లో తాజా వెర్షన్ స్మార్ట్ ఫోన్లను రిలీజ్ చేసుందుకు సిద్దమవుతుంది. ఇప్పటికే టీచర్ వచ్చేసింది. 2024 ఆగస్టులో గూగుల్ Pixel 9, గూగుల్ Pixel 9 Pro ఫోన్లను త్వరలో విడుదల చేయనుంది. ఇవి మెరుగైన పనితీరును కలిగి ఉంటాయని భావిస్తున్నారు. కెమెరాలు, రిఫ్రెష్డ్ డిజైన్, ఫ్రేమ్ లతో వస్తున్నాయి ఈ ఫోన్లు.
ఆపిల్ ఐఫోన్ 16, ఆపిల్ 16 PRO:
ఆపిల్ ఐఫోన్ 16 , ఆపిల్ 16 PRO అప్డేటెడ్ వెర్షన్లను త్వరలో అందించేందుకు సిద్దమవుతోంది. ఈ రెండు స్మార్ట్ ఫోనలు మనం ఎంతగానో ఎదురు చూస్తున్న iOS 18 వెర్షన్ iPhone లు అప్డేటెడ్ హార్డ్ వేర్, సాఫ్ట్ వేర్లతో వస్తుందని అంచనా. ఈ రెండు ఫోన్లు ఆపిల్ ఇంటెలిజెన్స్, కంబైనింగ్ ఆన్ డివైజ్ , ప్రైవేట్ క్లౌడ్ IA టెక్నాలజీలతో వస్తున్నట్లు తెలుస్తోంది.
SAMSUNG GALAXY Z ఫ్లిప్ 6, Z ఫోల్డ్ 6:
శామ్సంగ్ తన సరికొత్త ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్లను కొతత్త వైర్ లెస్ ఇయర్ బడ్ల, స్మార్ట్ వాచ్ లతోపాటు జూలై 10న లాంచ్ చేసేందుకు సిద్దంగా ఉంది. Galaxy Z Fold 6 దాని ముందు వెర్సన్ కంటే ఇంక్రిమెంటల్ అప్‌గ్రేడ్ తో , Galaxy Z Flip 6 కొంచెం పెద్ద బ్యాటరీని , మెరుగైన ప్రైమరీ కెమెరాలతో రానుంది. లాంచ్ చేసేముందు టిప్‌స్టర్ Galaxy Z Fold 6 , Galaxy Z Flip 6 స్పెక్ షీట్‌ను లీక్ చేసింది.
మోటరోలా రాజర్ , RAZR అల్ట్రా మోటరోలా:
2024 ప్రారంభంలో మోటరోలా వివిధ రకాల బడ్జెట్, మధ్య తరగతి, ప్రీమియం స్మార్ట్ ఫోన్లను విడుదల చేసింది. రెండో భాగంలో ప్లిఫ్పీ స్టైల్స్ ఫోల్డబుల్ మోటరోలా రాజర్ , RAZR అల్ట్రా పరిచయం చేస్తుందని తెలుస్తోంది.ఇవి సామ్ సంగ్ ఫోల్డబుల్ ఫోన్లకంటే మరింత తక్కువ ధరలో లభిస్తాయని అంచనా.. Motorola Razr+ విశాలమైన కవర్ డిస్ ప్లే, నాణ్యత గల డిజైన్ తో రానున్నాయి. మోటోరోలా Razr , మోటోరోలా Razr ఫ్లిప్ ఫోన్‌ల మరికొద్ది రోజుల్లో మార్కెట్లోకి రానున్నాయి.