8 మంది టీచర్లకు.. 36 మంది స్టూడెంట్సేనా!

8 మంది టీచర్లకు.. 36 మంది స్టూడెంట్సేనా!

 

  •     భూపాలపల్లి జిల్లా వల్లెంకుంటలో పిల్లల సంఖ్యపై మంత్రి అసంతృప్తి
  •     పిల్లల సంఖ్యను పెంచాలన్న శ్రీధర్​బాబు  
  •     గత ప్రభుత్వ లోపాలను సవరిస్తున్నామని కామెంట్​

జయశంకర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ భూపాలపల్లి/ మల్హర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌/మహాదేవ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, వెలుగు :  భూపాలపల్లి జిల్లా మల్హర్​ మండలంలోని వల్లెంకుంట హైస్కూల్​లో 8 మంది టీచర్లకు 36 మంది స్టూడెంట్స్​మాత్రమే ఉండడంతో రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి శ్రీధర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బాబు అసంతృప్తి వ్యక్తం చేశారు. బుధవారం భూపాలపల్లి జిల్లాలోని మల్హర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, కాటారం, మహాదేవ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మండలాల్లో మంత్రి పర్యటించారు. ఈ సందర్భంగా పల్లెంకుట హైస్కూల్​ను సందర్శించిన మంత్రి పిల్లల సంఖ్య తక్కువగా ఉండడం, ఉపాధ్యాయుల సంఖ్య ఎక్కువగా ఉండడాన్ని గమనించారు. ఆయన మాట్లాడుతూ డిగ్రీ, పీజీ, బీఈడీ, టీటీసీ చదివిన అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులున్నా స్టూడెంట్స్​తక్కువ సంఖ్యలో ఉండడం ఏమిటన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను పెంచాలని విద్యాశాఖ ఆఫీసర్లను, టీచర్లను  ఆదేశించారు. స్కూల్​లోని చిన్నారులతో ఫొటోలు దిగి బాగా చదువుకోవాలని సూచించారు. తర్వాత పలు ప్రభుత్వ పనులకు శంకుస్థాపనలు చేశారు. 

ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలు పరిష్కరిస్తాం

భూపాలపల్లి జిల్లాలో మంత్రి పర్యటించగా మల్హర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మండలంలో పలువురు ఉపాధ్యాయ సంఘాల లీడర్లు ఆయనను కలిసి వినతిపత్రం అందజేశారు. ప్రభుత్వ టీచర్లను సొంత జిల్లాలకు బదిలీ చేయాలని కోరగా అప్పటి ప్రభుత్వం ఇష్టానుసారంగా 317 జీవో ఇచ్చిందన్నారు. తాము అధికారంలోకి రాగానే ఉద్యోగుల సమస్యలను గుర్తించి సవరణ చేసేందుకు చూస్తున్నామన్నారు. గత ప్రభుత్వ ఉత్తర్వులను సవరించడానికి రాష్ట్ర ప్రభుత్వ న్యాయవాదులను సంప్రదించి చర్యలు తీసుకుంటామన్నారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కమిటీ ఏర్పాటు చేసిందన్నారు.

విద్యావ్యవస్థలో లోపాలు సవరిస్తాం!

గత పాలకుల లోపాలతో తెలంగాణ విద్యా వ్యవస్థ కుంటుపడిందని మంత్రి శ్రీధర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బాబు అన్నారు. ఇప్పటి ప్రజా ప్రభుత్వం ఆ లోపాలను ఒక్కొక్కటిగా సవరిస్తోందన్నారు. గత ప్రభుత్వం మండలానికో ఎంఈఓను, జిల్లాకో డీఈఓను నియమించకపోవడంతో విద్యా వ్యవస్థ నిర్వీర్యమైందని, తాము అధికారంలోకి వచ్చాక మండలానికో ఎంఈవో, ప్రతి జిల్లాకో డీఈవోను నియమించడానికి కార్యాచరణ రూపొందించామన్నారు.