అక్రమంగా మట్టి తరలిస్తున్న 8 ట్రాక్టర్లు సీజ్

జూలూరుపాడు, వెలుగు : అక్రమంగా మట్టి తరలిస్తున్న 8 ట్రాక్టర్లను గురువారం జూలూరుపాడు పోలీసులు సీజ్​ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గురువారం అర్ధరాత్రి మండల కేంద్రంలోని రైతు వేదిక దగ్గర  భూముల్లో అక్రమంగా మట్టి తవ్వుతున్నారన్న సమాచారంతో జూలూరుపాడు ఏఎస్ఐ తిరుపతిరావు,హెడ్ కానిస్టేబుల్ దయానంద్  దాడి చేశారు. 

ఐదు ట్రాక్టర్లను పట్టుకుని పోలీస్ స్టేషన్ కు  తరలించారు. అదేరాత్రి బేతాళపాడు గ్రామ శివారు చెరువులో ఇసుకను అక్రమంగా తరలిస్తున్న మూడు ట్రాక్టర్లను పోలీసులు పట్టుకున్నారు. రెండు ఘటనల్లో మొత్తం 8 ట్రాక్టర్లను సీజ్​ చేసి కేసు నమోదు చేశామని తెలిపారు.