
భారత ప్రభుత్వం వన్యమృగ సంరక్షణ కోసం 1952లో ఇండియన్ బోర్డ్ ఫర్ వైల్డ్ లైఫ్ అనే సంస్థను ఏర్పాటు చేసింది. ఈ సంస్థ అధ్యక్షుడు ప్రధాన మంత్రి. 1972లో వన్యమృగ సంరక్షణ చట్టాన్ని చేశారు. ఈ చట్టం ప్రకారం దేశంలో అంతరించిపోతున్న జంతువులకు సంబంధించి కొన్ని కార్యక్రమాలు చేపట్టారు. ఇందులో భాగంగా 1973 ఏప్రిల్ 1న ఆపరేషన్ టైగర్ అనే ప్రాజెక్టును ప్రారంభించి తొమ్మిది టైగర్ రిజర్వ్‌లను ప్రకటించారు. ఈ ప్రాజెక్టు ప్రకటించకముందు మన జాతీయ జంతువు సింహం. ప్రస్తుతం మన జాతీయ జంతువు పులి. దేశంలో ఏర్పాటు చేసిన మొదటి టైగర్ రిజర్వ్ కర్ణాటకలోని బందీపూర్ టైగర్ రిజర్వ్. ప్రస్తుతం దేశంలో 48 టైగర్ రిజర్వులు ఉన్నాయి. 48వ టైగర్ రిజర్వ్ ఉత్తరాఖండ్‌లోని రాజాజీ టైగర్ రిజర్వ్. దేశంలో అతి పెద్ద టైగర్ రిజర్వ్ నాగార్జునసాగర్– శ్రీశైలం టైగర్ రిజర్వ్. అతి చిన్న టైగర్ రిజర్వ్ మహారాష్ట్రలోని ఫెంచ్. తెలంగాణ రాష్ట్రంలో కవ్వాల్, నాగార్జున సాగర్, శ్రీశైలం టైగర్ రిజర్వ్‌లు వ్యాపించి ఉన్నాయి.
టైగర్ సెన్సెస్
దేశంలో మొదటిసారిగా టైగర్ సెన్సెస్‌ను 2006లో చేపట్టారు. టైగర్ సెన్సెస్ 2018 ప్రకారం భారతదేశంలోని పులుల సంఖ్య 2967. టైగర్ సెన్సెస్ 2014 ప్రకారం భారతదేశంలోని పులుల సంఖ్య 2226. ప్రపంచంలోని పులుల్లో 80శాతం ఇండియాలో ఉన్నాయి.
అధిక పులులు గల రాష్ట్రం
1. మధ్యప్రదేశ్ (526), 2. కర్ణాటక (524), 3. ఉత్తరాఖండ్ (442), పశ్చిమబెంగాల్లోని బుక్సా, జార్ఖండ్‌లోని ఫలమావు, మిజోరాంలోని దంపా టైగర్ రిజర్వ్‌ల్లో పులులు లేవు..