80 క్వింటాళ్ల రేషన్‌‌‌‌ బియ్యం పట్టివేత 

గన్నేరువరం, వెలుగు: కరీంనగర్‌‌‌‌‌‌‌‌ జిల్లా గన్నేరువరం మండలం కసింపేట  గ్రామంలో తరలించేందుకు సిద్ధంగా ఉన్న 80 క్వింటాళ్ల రేషన్‌‌‌‌ బియ్యాన్ని అధికారులు పట్టుకున్నారు. గ్రామానికి చెందిన ఆడెపు రాజు, బొజ్జ ఐలయ్య పలువురి దగ్గర రేషన్‌‌‌‌ బియ్యం సేకరించారు. శుక్రవారం అర్ధరాత్రి వాటిని తరలించేందుకు డీసీఎంలో లోడ్‌‌‌‌చేయగా పక్కా సమాచారంతో ఎస్‌‌‌‌ఐ నరేశ్‌‌‌‌ తన సిబ్బందితో కలిసి అక్కడికి చేరుకొని రెడ్‌‌‌‌ హ్యాండెడ్‌‌‌‌గా పట్టుకున్నారు. వెహికల్‌‌‌‌ను సీజ్‌‌‌‌ చేసి, నిందితులపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌‌‌‌ఐ తెలిపారు.