80 క్వింటాళ్ల రేషన్​ బియ్యం పట్టివేత

80 క్వింటాళ్ల రేషన్​ బియ్యం పట్టివేత

యాదాద్రి, వెలుగు : 80 క్వింటాళ్ల రేషన్​ బియ్యం పట్టుబడిన ఘటన యాదాద్రి జిల్లా గుండాల మండలం మాసాన్​పల్లిలో మంగళవారం జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం.. మాసాన్​పల్లిలోని కాశీం ఇంట్లో అక్రమంగా రేషన్​ బియ్యం నిల్వలు ఉన్నట్టుగా ఎస్​వోటీ పోలీసులకు సమాచారం అందింది. 

దీంతో పోలీసులు ఆ ఇంటిపై దాడులు నిర్వహించి 80 క్వింటాళ్ల రేషన్​ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. వివిధ రేషన్​షాపులతోపాటు కొందరు వినియోగదారుల నుంచి ప్రతినెలా తక్కువ ధరకు బియ్యం కొనుగోలు చేసి ఎక్కువ రేటుకు ఇతరులకు అమ్ముతున్నట్లు గుర్తించారు. నిందితుడిపై పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.