సాగర్ కు 80 వేలకు పైగా క్యూసెక్కుల ఇన్ ఫ్లో

సాగర్ కు 80 వేలకు పైగా క్యూసెక్కుల ఇన్ ఫ్లో

హాలియా, వెలుగు : నాగార్జునసాగర్​ప్రాజెక్ట్​కు ఎగువ నుంచి వరద ప్రవాహం కొనసాగుతూనే ఉంది.  శ్రీశైలం నుంచి 80,362 క్యూసెక్కుల ఇన్​ఫ్లో వస్తుండగా 4 గేట్లను పైకి ఎత్తి 3,1836  క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. మంగళవారం సాయంత్రం 6 గంటల వరకు సాగర్ ప్రాజెక్టు పూర్తి నీటి మట్టం 590 అడుగులు (312.50 టీఎంసీలు)గాను

588.70 అడుగులు(308. 1702 టీఎంసీలు)గా నమోదైంది. సాగర్‌  కుడి కాల్వకు 10, 040, ఎడమ కాల్వకు 6, 173 , విద్యుత్​ ఉత్పత్తికి 29, 513, ఎస్‌ఎల్‌బీసీకి 2,400, వరద కాల్వకు 400 క్యూసెక్కుల చొప్పున నీటిని విడుదల చేస్తున్నారు.