- మరికొన్నింటిని దారి మళ్లించిన ఎస్సీఆర్
సికింద్రాబాద్, వెలుగు: భారీ వర్షాలతో దక్షిణ మధ్య రైల్వే పరిధిలో 80 రైళ్లను రద్దు చేశారు. 49 రైళ్లను దారి మళ్లించారు. మరో 5 రైళ్లను పాక్షికంగా రద్దు చేశారు. విజయవాడ–--సికింద్రాబాద్–--విజయవాడ, గుంటూరు–-సికింద్రాబాద్, సికింద్రాబాద్–--సిర్పూర్ కాగజ్ నగర్, కాకినాడ పోర్ట్–--లింగంపల్లి, గూడూరు–-సికింద్రాబాద్, భద్రాచలం–--బల్లార్షా, బల్లార్షా–--కాజీపేట, భద్రాచలం–--సికింద్రాబాద్, కాజీపేట–--డోర్నకల్, హైదరాబాద్--–షాలిమార్, సికింద్రాబాద్ –--విశాఖపట్నం, హౌరా–--సికింద్రాబాద్, సికింద్రాబాద్–--తిరువనంతపురం, మహబూబ్ నగర్–--విశాఖపట్నం, లింగంపల్లి– -ఎంవిటి ముంబై, కరీంనగర్–తిరుపతి, చెన్నై సెంట్రల్–- -జైపూర్, చెన్నై సెంట్రల్–- -న్యూఢిల్లీ, నాందేడ్–--షాలిమర్, తిరుపతి–--సికింద్రాబాద్, చెన్నై సెంట్రల్-–--న్యూఢిల్లీ, ఎంవిటి ముంబై-–-- విశాఖపట్నం,
సికింద్రాబాద్–--విజయవాడ, గుంటూరు-–-సికింద్రాబాద్, విజయవాడ-–-భద్రాచలం రోడ్డు మార్గాల్లో నడుస్తున్న రైళ్లను రద్దు చేసినట్టు రైల్వే అధికారులు వెల్లడించారు.
రైల్ నిలయంలో డిజాస్టర్ మేనేజ్మెంట్ కంట్రోల్ రూమ్ ద్వారా పరిస్థితులను సమీక్షిస్తున్నట్లు సీపీఆర్ వో శ్రీధర్ తెలిపారు. ప్రయాణికులు ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పారు. ప్రయాణికుల భద్రత కోసమే రైళ్లను రద్దు చేశామని ఆయన వివరించారు. పెద్ద ఎత్తున రైళ్లు రద్దు కావడంతో దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ అన్ని డివిజన్ల అధికారులతో సమీక్ష నిర్వహించారు. అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రయాణికులకు ప్రత్యామ్నాయ ఏర్పాటు చేయాలని ఆదేశించారు.