బావిలో పడ్డ అవ్వ..కాపాడిన ఫైర్ సిబ్బంది

ప్రమాదవశాత్తు బావిలో పడిపోయిన 80 ఏళ్ల వృద్ధురాలను అగ్నిమాపక సిబ్బంది ఎలాంటి గాయాలు లేకుండా కాపాడారు. ఈ ఘటన కరీంనగర్ జిల్లా మానకొండూర్ లో చోటుచేసుకుంది. ఇక  వివరాల్లోకి వెళ్తే.. వృద్ధురాలు ప్రమాదవశాత్తు బావిలో పడిపోయిందని ఆమె కుమారుడు రవీందర్‌ అగ్నిమాపక యూనిట్ ఆఫీసు‌కి ఫోన్ చేశాడు.  సమాచారం అందుకున్న టీమ్ వెంటనే  ఘటనా స్థాలనికి చేరుకుని చైర్‌ నాట్‌ పద్ధతితో వృద్ధురాలను క్షేమంగా బయటకు తీసుకువచ్చారు. వృద్ధురాలను కాపాడి తమకు అప్పగించినందుకు అగ్నిమాపక సిబ్బందికి ఆమె కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.