ఆరోగ్య రన్ సూపర్ సక్సెస్

ఆరోగ్య రన్ సూపర్ సక్సెస్
  • ఉత్సాహంగా పాల్గొన్న 800 మంది 

మేడిపల్లి, వెలుగు: మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని రాచకొండ రన్నర్స్ అధ్యక్షుడు ప్రభాకర్ ఆధ్వర్యంలో ఆదివారం మేడిపల్లి నందనవనం పార్కులో ఆరోగ్య రన్ నిర్వహించారు. ముఖ్య అతిథులుగా పీర్జాదిగూడ మాజీ మేయర్ జక్క వెంకట్ రెడ్డి, ఆనంద ఇన్ఫినిటీ జాయ్ ఎండీ గురునాథ్ పాల్గొని జెండా ఊపి ప్రారంభించారు. 2కే, 5కే,10కే, 20కె రన్​ నిర్వహించగా, స్టూడెంట్స్, యువకులు, మహిళలు, సీనియర్ సిటిజన్స్ ఉత్సాహంగా పాల్గొన్నారు. తర్వాత ప్రతిభ చూపినవారికి మెడల్స్​అందజేశారు. 

రాచకొండ రన్నర్ అధ్యక్షుడు ప్రభాకర్ మాట్లాడుతూ ఈస్ట్ సిటీలో విశాలమైన పబ్లిక్ పార్క్ ఉన్నప్పటికీ ప్రజలు ఉపయోగించుకోవడం లేదని, వారికి ఆరోగ్యం, వ్యాయామంపై చైతన్యం కల్పించేందుకే ఈ రన్ నిర్వహించామన్నారు. ఎల్బీనగర్ ఏసీపీ నవీన్ రెడ్డి, పోచారం ఎస్సై నాగార్జునరెడ్డి, హైకోర్టు అడ్వకేట్ శంకర్ గౌడ్, అనురాగ్ యూనివర్సిటీ ఏవో ప్రదీప్ రెడ్డి, ఎస్సీ ఎస్టీ బీసీ సంఘాల రాష్ట్ర అధ్యక్షుడు నరసింహ నాయక్, కట్ట శేఖర్, ఓయూ జేఏసీ, రాచకొండ రన్నర్స్ సభ్యులు మోహన్ రెడ్డి, సందీప్ రెడ్డి, దిలీప్ రెడ్డి, మల్లేష్, నవీన్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, వెంకట్ రెడ్డి  పాల్గొన్నారు.