
మిర్యాలగూడ, వెలుగు: నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలో అక్రమంగా నిల్వ చేసిన బెల్లం, పటికను ఆదివారం పట్టుకున్నట్లు ఎక్సైజ్ ఎస్సై రాఘవేందర్ గౌడ్ తెలిపారు. పట్టణంలోని రాజీవ్ చౌక్ ఏరియా సమీపంలో ఈ నెల 19న చేపట్టిన తనిఖీల్లో బైక్పై తరలిస్తున్న బెల్లం గుర్తించి విచారణ చేపట్టగా, భారీగా బెల్లం, పటిక ఉన్నట్లు తేలిందన్నారు.
పట్టణంలోని సీతారాంపురం కాలనీకి చెందిన బైసాని సత్యనారాయణ షాబునగర్ సమీపంలోని గోడౌన్ లో నిల్వ చేసిన 800 కేజీల బెల్లం, 1,400 కేజీల పటిక స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. అతనిపై గతంలో రెండు కేసులతో పాటు బైండోవర్ ఉందన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై చెప్పారు.