ఎస్టీపీపీలో 800 మెగావాట్ల మూడో ప్లాంట్​..కలెక్టర్ కుమార్ దీపక్ వెల్లడి

ఎస్టీపీపీలో 800 మెగావాట్ల మూడో ప్లాంట్​..కలెక్టర్ కుమార్ దీపక్ వెల్లడి
  • మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ వెల్లడి
  • ప్లాంట్​ భూమి పూజ కోసం అధికారులతో ఏర్పాట్ల పరిశీలన

కోల్ బెల్ట్/జైపూర్,వెలుగు:  మంచిర్యాల జిల్లా జైపూర్ ​మండలం పెగడపల్లి వద్ద సింగరేణి థర్మల్​పవర్ ప్లాంట్​ ఆవరణలో మరో 800 మెగావాట్ల విద్యుత్​ ప్లాంట్​ఏర్పాటుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్​ కుమార్​ దీపక్​ తెలిపారు. 1200 మెగావాట్ల సింగరేణి థర్మల్​పవర్​ప్లాంట్​(ఎస్టీపీపీ) ఏర్పాటులో భాగంగా  భూమిపూజకు అవసరమైన ఏర్పాట్లను శుక్రవారం ఆయన పరిశీలించి మాట్లాడారు.

800 మెగావాట్ల పవర్​ ప్లాంట్​ను రూ.9.500 కోట్లతో నిర్మిస్తున్నామన్నారు. త్వరలో రాష్ట్ర ప్రముఖులతో ప్రారంభించేందుకు రెడీగా ఉండాలని ఆఫీసర్లను ఆదేశించారు. మరోవైపు హడావుడిగా ఎస్టీపీపీలో మూడో ప్లాంట్​నిర్మాణానికి భూమి పూజకు అవసరమైన ఏర్పాట్లు చేయడం చర్చనీయాంశంగా మారింది. ఆదివారం  సీఎం రేవంత్​రెడ్డి లేదా  డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో వస్తారనే ప్రచారం కూడా జరిగింది.

అధికారికంగా రాష్ట్ర సర్కార్​నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు. ఎస్టీపీపీలో వివిధ శాఖ ఆఫీసర్లు, సిబ్బంది  భూమిపూజకు ముందస్తు ఏర్పాట్లు  చేయడాన్ని కలెక్టర్​పరిశీలించారు. ఇటీవల మూడో ప్లాంట్​ నిర్మాణ పనులు దక్కించుకున్న బీహెచ్​ఈఎల్​ కంపెనీతో సింగరేణి ఒప్పందం చేసుకుంది. నెల రోజుల్లో  పనులు ప్రారంభిస్తామని నిర్మాణ కంపెనీ తెలిపింది.

అడిషనల్ కలెక్టర్ మోతీలాల్, సింగరేణి థర్మల్ విద్యుత్ ప్లాంట్ ఇన్​చార్జ్ జీఎం శ్రీనివాసులు,  శ్రీరాంపూర్​ఏరియా జీఎం ఎం.శ్రీనివాస్​, మంచిర్యాల ఆర్డీవో  శ్రీనివాస్ రావు, జైపూర్ ఏసీపీ వెంకటేశ్వర్లు, జైపూర్​తహసీల్దార్​వనజారెడ్డి ఉన్నారు.