నా జీవితమే ఓ సినిమా : ముత్తయ్య మురళీధరన్‌‌

నా జీవితమే ఓ సినిమా : ముత్తయ్య మురళీధరన్‌‌

శ్రీలంక క్రికెటర్‌‌, స్పిన్‌‌ మాంత్రికుడు ముత్తయ్య మురళీధరన్‌‌ జీవితం ఆధారంగా రూపొందిన చిత్రం ‘800’. మురళీధరన్‌‌ పాత్రను మధుర్‌‌ మిట్టల్ పోషించగా, మహిమా నంబియార్‌‌ ఫీమేల్‌‌ లీడ్‌‌గా నటించింది. ఎం.ఎస్‌‌. శ్రీపతి దర్శకత్వంలో వివేక్ రంగాచారి నిర్మించిన ఈ చిత్రాన్ని శివలెంక కృష్ణ ప్రసాద్  అక్టోబర్ 6న పాన్ ఇండియా వైడ్‌‌గా రిలీజ్ చేస్తున్నారు. 

ఈ సందర్భంగా ముత్తయ్య మురళీధరన్ మాట్లాడుతూ ‘శ్రీలంక ప్రజలకు సహాయం చేయడం కోసం 20 ఏళ్ళ క్రితం  ఫౌండేషన్ స్థాపించా. దాని ద్వారా ఎంతో మందికి సాయం అందించాం. నా వైఫ్ మదిమలర్, దర్శకుడు వెంకట్ ప్రభు చైల్డ్ హుడ్ ఫ్రెండ్స్. తనతో పాటు శ్రీపతి నన్ను కలిసి బయోపిక్ ప్రపోజల్ తెచ్చారు. 

మొదట నాకు ఆసక్తి లేకపోయినా.. ఫౌండేషన్ కోసం చేద్దామని నా మేనేజర్ కన్విన్స్ చేయడంతో ఓకే చెప్పా. అయితే నిజంగా జరిగిన కథ మాత్రమే చూపించాలని కండిషన్ పెట్టా. నా జీవితమే ఓ సినిమాలా ఉంటుంది. మంచి చెడుతో పాటు చాలా విషయాలు జరిగాయి. ఇందులో క్రికెట్ 20 శాతమే. మిగతాదంతా నా లైఫ్ స్టోరీనే. నా పాత్రను మధుర్ మిట్టల్  బాగా పోషించాడు. శివలెంక కృష్ణప్రసాద్ గారు వరల్డ్‌‌వైడ్‌‌గా రిలీజ్ చేస్తున్నారు. శ్రీలంకలో సింహళీ వెర్షన్‌‌ విడుదల చేస్తున్నాం’ అన్నారు.